వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగించాలా లేదా అన్నదానిపై సీబీఐ కోర్టు ఈ నెల పదో తేదీన తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసింది. తీర్పును పదో తేదీన ప్రకటించనున్నారు. ఈ కేసు చాలా మలుపులు తిరుగుతోంది. నిందితులు దర్యాప్తును పదే పదే అడ్డుకోవడంతో పాటు ఇప్పుడు న్యాయవ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని విచారణ జరగకుండా ఆలస్యం చేస్తున్నారు., కానీ రివర్స్ లో బాధితులపైనే ఆరోపణలు చేస్తున్నారు. హత్యకు పాత్ర ధారులు బయటపడ్డారు కానీ అసలు సూత్రధారులు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
క్లోజ్ చేయాలనుకుంటే గంటల్లో పూర్తి చేసే కేసు వివేకా హత్య కేసు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పూర్వాపరాలను ఓ సారి గుర్తు తెచ్చుకుంటే.. నిందితులు అత్యంత దారుణంగా హత్య చేయించి చాలా ఇంత బహిరంగంగా తప్పించుకోవచ్చా?. దర్యాప్తు సంస్థల మీద దాడి చేయవచ్చా?. సీబీఐ అరెస్టు చేయడానికి వస్తే అధికార బలం ఉపయోగించి తప్పించుకోవచ్చా ? అని సామాన్యుడు కూడా ఆశ్చర్యపోతాడు. మొదట వివేకానందరెడ్డి దారుణ హత్యను రక్తపువాంతులు , గుండెపోటు అని నమ్మించాలని చూశారు. ఆయనకుమార్తె, అల్లుడు రాక ముందే అంత్యక్రియలు చేసేయాలనుకున్నారు. పోస్టుమార్టం వద్దన్నారు. మృతదేహానికి కట్లు కట్టారు. కానీ చివరికి అన్నీ ఫెయిల్ కావడంతో చంద్రబాబు చంపించారని నాటకాలు ప్రారంభించారు.
సాక్ష్యాలు మాయం, దర్యాప్తు అధికారులపై దాడులే నిందితుల్ని పట్టించడం లేదా ?
తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ కేసును ఎంత అడ్డగోలుగా మార్చాలో అంతా మార్చారు. చివరికి సునీతను, ఆమె భర్తనే నిందితులుగా మార్చి..కేసును క్లోజ్ చేయాలనుకున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. కానీ కేసు సీబీఐకి వెళ్లడంతో వారికి రిలీఫ్ దక్కింది. సీబీఐ పై అధికార బలంతో దాడి చేశారు. దర్యాప్తు అధికారిపై కేసులు పెట్టారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే నాలుగు రోజులు కర్నూలు ఆస్పత్రిలో దాక్కుని.. సీబీఐ అధికారులు రాకుండా రౌడీముకల్ని అడ్డం పెట్టుకున్నారు. వారికి పోలీసులు సహకరించారు. ఇంత దారుణంగా హత్యకేసు నిందితులు వ్యవహరించారు.
హత్యలు చేసి తప్పించుకోగలరన్న సంకేతాలు వ్యవస్థలు ఇవ్వవు !
అసలు సూత్రధారి ఎవరో చాలా మందికి క్లారిటీ ఉంది. దర్యాప్తుసంస్థ కూడా.. హత్య జరిగిందన్న ముందస్తు సమాచారం.. హైదరాబాద్ కు చేరిందని బయటపెట్టింది. అక్కడ్నుంచే అసలు నిందితులు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ బయటకు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. పదో తేదీన సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు.. వ్యవస్థల పవర్ ను .. మరింతగా చూపిస్తుందని నమ్ముతున్నారు. దారుణమైన హత్యలు చేసి మరీ .. తప్పించుకోవచ్చన్న సందేశాన్ని పంపదని నమ్మకంతో ఉన్నారు.
