రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రకటించిన విజన్ డాక్యుమెంట్లో క్యూర్ అంశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది . CURE మాడల్ హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగ్ రోడ్ – ORR లోపలి 2,170 చ.కి.మీ. ప్రాంతంపై దృష్టి సారిస్తుంది. కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ సెక్టార్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో క్యూర్ మోడల్ విజయవంతం చాలా కీలకం.
CURE అంటే ORR లోపలి ప్రాంతం, ఇక్కడ GHMC, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర్ పంచాయతీలు వంటి బహుళ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు ఉన్నాయి. క్యూర్ మోడల్ అమలు కోసం వీటన్నింటినీ విలీనం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలు, డీజిల్ వాహనాల వల్ల భారీ కాలుష్యానికి గురవుతోంది. కాలుష్యాన్ని జీరో చేయడం, సస్టైనబుల్ గ్రోత్ ప్రమోట్ చేయడం కోసం హిల్ట్ పాలసీని తీసుకు వస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, నదిని శుభ్రం చేసి, గ్రీన్ స్పేసెస్ సృష్టించడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరచడం, వ్యక్తిగత వాహనాలను తగ్గించడం వంటివి లక్ష్యాలుగా పెట్టుకున్నారు.
ఈ ప్లాన్ అమలు చేసే కొద్దీ.. మెట్రో, గ్రీన్ స్పేసెస్ వల్ల లైఫ్ క్వాలిటీ మెరుగుపడుతుంది. విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయి. పాజిటివ్‌గా, ఇది హైదరాబాద్‌ను పొల్యూషన్-ఫ్రీ మెట్రోపాలిటన్ గా మార్చి, టూరిజం, నైట్ ఎకానమీని బూస్ట్ చేస్తుంది. CURE మాడల్ హైదరాబాద్‌ను గ్రీన్, గ్లోబల్ సిటీగా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఒక విజనరీ స్టెప్ అనుకోవచ్చు. ఇలాంటి లక్ష్యాలు రాత్రికి రాత్రి సాధించలేరు. కనీసం పదేళ్ల పాటు తమ ప్రణాళికల్ని.. పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. తేడా వస్తే మాటలుగానే మిగిలిపోతాయి.
