తెదేపా-భాజపా కొత్త ఎపిసోడ్..ఎంతవరకు వచ్చింది?

పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం తెర మీదకి రావడం, దాని గురించి అందరూ గట్టిగా వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం, హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మళ్ళీ చెప్పడం, అప్పుడు తెదేపా నేతలు కేంద్రంపై ఫైర్ అవడం, వారికి భాజపా నేతలు కౌంటర్ ఇవ్వడం, తరువాత చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చి మిత్రపక్షమైన భాజపాని, కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి నోరు జారవద్దని హెచ్చరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ నాలుగు మంచి మాటలు మాట్లాడటం, అప్పుడు తెదేపా నేతలు, ఎంపీలు కూడా ప్రత్యేక హోదాతో సహా అన్ని హమీలని సాధించుకొనే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పడంతో ఆ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇది వినడానికి చాలా చేదుగా ఉన్నా గత రెండేళ్ళుగా జరుగుతున్నది మాత్రం ఇదే. మళ్ళీ పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి కనుక ఈ కొత్త ఎపిసోడ్ లో కధ ఎంతవరకు వచ్చిందో చూద్దాము.

ఈ ఎపిసోడ్ లో ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం వరకు పూర్తయింది. ఇప్పుడు తరువాయి భాగం: తెదేపా ఎంపి సిఎం రమేష్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అటు కేంద్రప్రభుత్వం చూస్తే ఎక్కడా చిక్కకుండా తప్పించుకొంటోంది. ఇటు కాంగ్రెస్ పార్టీని చూస్తే దానికి చిత్తశుద్ధి లేకపోవడంతో సభలో చర్చ జరుగుతున్నప్పుడు, కేంద్రప్రభుత్వంతో గట్టిగా పోరాడకుండా సభలో నుంచి వాక్ అవుట్ చేసి బయటకి వెళ్లిపోయింది. అవును ఏపికి హోదా ఇస్తామని చెప్పామని, నేనే పదేళ్ళు ఇమ్మని అప్పుడు పట్టుబట్టానని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏదేదో చెపుతున్నారు తప్ప ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం లేదు.

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరొకలాగ తప్పించుకొన్నారు. పశ్చిమ బెంగాల్ అడుగుతోంది..బిహార్ అడుగుతోంది..ఓడిశా కూడా ప్రత్యేక హోదా అడుగుతోంది..అని కుంటిసాకులు చెపుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేస్తే, ఏవిధంగా బుద్ధి చెప్పారో అందరూ చూశారు. చేజేతులా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను సభలోనే కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించాను. కానీ జైట్లీ జవాబు చూస్తే ఆయన ఆ హెచ్చరికలని ఖాతరు చేసినట్లు లేదు. మేము విభజన చట్టంలో ఏముందో దానిని ఇమ్మని అడుగుతున్నాము తప్ప కొత్తగా ఏదీ అడగడం లేదు కదా? అవి కూడా ఎందుకు ఇవ్వడం లేదు?

ప్రత్యేక హోదా విభజన చట్టం లేదని ఇంతకాలం కేంద్రప్రభుత్వం సాకులు చెపుతోంది. ఇప్పుడు రాజ్యసభలో అన్ని పార్టీలు ఏపికి ప్రత్యేక హోదా మద్దతు ఇస్తున్నప్పుడు, కేంద్రప్రభుత్వమే స్వయంగా దాని కోసం ఒక బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపజేసి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు కదా? మిగిలిన రాష్ట్రాలు ఏపికి హోదా ఇమ్మని గట్టిగా చెపుతున్నాయి. వీలైతే తమకీ ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాయి తప్ప ఏపికి ఇస్తే మాకు ఇవ్వాలని పట్టుబట్టడం లేదు కదా? అసలు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నప్పుడు కేంద్రప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది?” అని సిఎం రమేష్ ప్రశ్నించారు.

ఈసారి అయన, సుజనా చౌదరి ఇద్దరూ సభలో, బయటా కొంచెం గట్టిగానే మాట్లాడారు. కానీ ఫలితం లేదు. ఉండదని అందరికీ తెలుసు. ఈ ఎపిసోడ్ లో వారి పాత్ర పూర్తయిందో ఇంకా ఉందో తెలియదు. ఇప్పుడు రాష్ట్ర భాజపా నేతలు ఎంట్రీ ఇస్తే ఈ ఎపిసోడ్ యధాప్రకారం బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. బహుశః నేడోరేపో వారు ఎంట్రీ ఇస్తారేమో. చివరికి ఏపికి ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీలు చదరంగం ఆడుకోవడానికి మాత్రమే పనికి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close