టీ న్యూస్ చానల్ పై కేసులు వేయాల్సిన పరిస్థితి వస్తుందని కల్వకుంట్ల కవిత కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడా పరిస్థితి వచ్చింది. తనపై తప్పుడు వార్తుల ప్రసారం చేసినందుకు టి న్యూస్ ఛానల్‌కు లీగల్ నోటీసు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల గడువు ఇచ్చారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాధవరం ఆమెను కుక్కతో పోల్చారు. ఆ ఆరోపణలను టీ న్యూస్ చానల్ పదే పదే ప్రసారం చేసింది. ఈ తీరుతో ఆగ్రహం చెందిన కవిత.. ఆరోపణలు చేసిన నేతలతో పాటు టీ న్యూస్ కూడా నోటీసులు పంపించారు. మీకు దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. ..అంతేకానీ.. నామీద ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను అని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్స్టాండింగ్ లేదు అని కవిత స్పష్టం చేశారు.
అనిల్, మహేశ్వర్ రెడ్డి … కవిత భర్త దేవరపల్లి అనిల్ కుమార్ మీద భూకబ్జా ఆరోపణలు చేశారు. అనిల్, కవిత , ఏవీ రెడ్డి ఏవీఆర్ ఇన్‌ఫ్రాలు ఓవర్లాపింగ్ సర్వే నంబర్లు, తప్పుడు డాక్యుమెంట్లతో రూ.2 వేల కోట్ల విలువైన 20 ఎకరాలకు పైగా భూములు కబ్జా చేశారని ఆరోపించారు. అవన్నీ ఐడీపీఎల్ భూములని.. తప్పుడు సర్వేలతో కబ్జా చేయడం. ఏవీ రెడ్డి కీలక పాత్ర పోషించాడని, అనిల్ కుమార్ ద్వారా భూములు కొనుగోలు చేసి వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు జారీ చేశారు.
