పవన్ కల్యాణ్ డ్యాన్స్, యాక్షన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఆయనకంటూ సొంతమైన సిగ్నేచర్ మూమెంట్స్ వుంటాయి. అలాంటి మూమెంట్స్ చూసి చాలా కాలమైయంది. పవన్ యాక్షన్ రేజ్ ఓజీతో తీరింది. ఇప్పుడు డ్యాన్స్ వంతు వచ్చింది. పవన్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలు.
పాటతో ఈ సినిమా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ‘దేఖ్లేంగే సాలా.. చూసినాము చాలా’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ పవన్ వేసిన స్టెప్లు అభిమానులని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ ఫ్లోర్ లో ఆయన కదలికలు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్ వున్న పాటని కంపోజ్ చేశారు. భాస్కర్ భట్ల సాహిత్యం క్యాచిగా వుంది. విశాల్ ధడ్లానీ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. పవన్ డ్యాన్స్ మూమెంట్స్ ని చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చే పాటిది. జల్సా నాటి పవన్ ఎనర్జీ ఈ సాంగ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేసింది.
