చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. సంక్రాంతికి కాస్త ముందుగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
12 అంటే సోమవారం రిలీజ్. అంతకుముందు రోజే ప్రిమియర్స్ కూడా వుండే అవకాశం వుంది. పండగ సెలవులన్నీ సినిమాకి కలిసొచ్చేలా ప్లాన్ చేశారు. సంక్రాంతి సీజన్లో భారీ ఓపెనింగ్స్‌తో పాటు స్ట్రాంగ్ బాక్సాఫీస్ రన్‌కు వుంటుదని నిర్మాతల నమ్మకం.
ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరు అందుకున్నాయి. రెండు పాటలు హిట్ అయ్యాయి. అనిల్ రావిపూడి సూపర్ ఫామ్ లో వున్నాడు. ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై బజ్‌ను మరింత పెంచుతుంది. ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా వున్న సినిమాల్లో శంకర వరప్రసాద్ ముందు వరుసలో వుంది.
