రాజకీయాల్లో ఎలా మాట్లాడకూడదో కేటీఆర్ అలా మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి జీవితం కంటే చావే మేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు గౌరవం కోల్పోయారని, వారు ఇక ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని స్థితికి చేరారని ఎద్దేవా చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డికి 75 ఏళ్లు వచ్చాయని ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి, స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. ఇంకేం కావాలని ఆయన పార్టీ మారారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల్లో కూర్చుకుంటున్నారని అలా ఎందుకు కూర్చుకుంటున్నారని అడిగితే.. బాత్రూంకు దగ్గరగా ఉంటుందని కూర్చుంటున్నానని చెప్పారని ఇలాంటి బతుకు అవసరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో చేరి తన మంచి పేరు కోల్పోయారు. ఇలాంటి జీవితం కంటే చావే మేలు అని విరుచుకుపడ్డారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమే కాదు.. అత్యంత సీనియర్ అయిన నేతను .. ఇతర ఎమ్మెల్యేలతో కలిపి చనిపోవడమే మేలు ఉని మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది. కేటీఆర్ తీరు విమర్శల పాలవుతోంది. పోచారం బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరగలేదు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడే సుదీర్ఘకాలం మంత్రిగా చేశారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కంటే ముందే మంత్రి అయ్యారు. అలాంటి నేతను కేటీఆర్ ఘోరంగా అవమానిస్తున్నారు. టీడీపీ నుంచి ఎలా బీఆర్ఎస్ల్ లో చేరారో.. అలాగే కాంగ్రెస్లో చేరారు. అంత మాత్రాన చావుల గురించి మాట్లాడటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.
