తెలంగాణ అగ్రనేతలు తెలుగుభాషకు మంచి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చిన్నా నేతలు మాట్లాడుకుంటే ఎవరూ పట్టించుకోరు. అగ్రనేతలే అలా మాట్లాడుతున్నారు. తెలుగులో అందరూ జనరల్ గా మాట్లాడుకునే మాటల్ని రాజకీయ తెరపైకి తెచ్చి ఒకరికి ఒకరు అనేసుకుంటున్నారు. వారి మాటలతో ప్రజలు కూడా కనెక్ట్ అయిపోతున్నారు. అవన్నీ మనం మనం తిట్టుకోవడానికి వాడుకుంటామని అనుకున్నామే.. సీఎంలు, ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అలాంటి తిట్లతోనే మాట్లాడుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
నీ యవ్వ..లాగులో లాగుల్లో తొండలు వదిలి కొడతా !
కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నువ్వెంత నీ స్థాయెంత?’ అని ప్రశ్నించారు. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటకి నెట్టావ్ ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా, నీ అవ్వ లాగులో తొండ విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు. అమెరికాలో బాత్రూమ్లు కడిగినట్లు అనుకున్నావా నాతోని మాట్లాడటం అంటే అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నూ వదల్లేదు.. మంచం మీద నుంచి పడి మక్కెలిరగకొట్టుకున్నాడని. .ఆయనను తానేం చేస్తానని వ్యాఖ్యానించారు. ఏ జైల్లో పెట్టినా.. ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటేనని..తననుతాను బందీని చేసుకున్నారని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ భాషకు కౌంటరే !
తెలంగాణ రాజకీయాల్లో తిట్టే హక్కు తమకే ఉందన్నట్లుగా కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తూంటారు. వారు తెలంగాణ ఉద్యమం పేరుతో మొదట్లో తిట్టేవారు. ఎవరైనా ఎదురుతిరిగితే తెలంగాణను తిట్టారని రాజకీయం చేసేవారు. అందుకే అప్పట్లో ఎవరూ తిరిగి తిట్టేవారు కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది రాజకీయం. వారు తమలపాకుతో మాట్లాడితే.. తలుపుచెక్కతో సమాధానం ఇచ్చే రేవంత్ నాయకుడిగా ఉన్నారు. ఆయన ఎక్కడా తగ్గడంలేదు. మాటకు మాట ఇస్తున్నారు. భాషా సాహిత్యంలో కేసీఆర్ ను మించిన ప్రతిభ రేవంత్ కు ఉంది. ముఖ్యమంత్రి అలా మాట్లాడవచ్చునా అంటారు.. మరి ముఖ్యమంత్రిని అలా మాట్లాడవచ్చునా అని మాత్రం అనుకోరు. తండ్రీకొడుకులు ఇద్దరూ తిట్లందుకుంటే రేవంత్ కూడా అందుకుంటున్నారు. ఇక్కడ మొదట ప్రారంభించినవారిదే తప్పు.
తిట్లతో ఏం కాదు.. గౌరవ రాజకీయాలు చేయాలి!
కేసీఆర్ తనకు రాజకీయ భాష వచ్చు అని.. రేవంత్ రెడ్డి తన కన్నా చాలా చిన్న వ్యక్తి అనుకుని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. రేవంత్ వయసులో చిన్న వ్యక్తి కావొచ్చు.. కానీ ఇప్పుడు హోదాలో పెద్ద వ్యక్తి. ఆయనను గౌరవించి రాజకీయంగానే విమర్శలు చేయాల్సి ఉంది. కేటీఆర్ తాను రేవంత్ ను గౌరవించను అని బహిరంగంగా ప్రకటించి ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవం తగ్గిపోతుంది. అందుకే రేవంత్ తనదైన భాషలో కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా వీరి భాషా సేవ మాత్రం రాజకీయాల్లో తిట్లను కామన్ గా మార్చేస్తోంది.
