కొడంగల్‌లో సర్పంచ్ల అభినందన సభలో సీఎంరేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ పార్టీ నేతల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. కేసీఆర్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలతో రేవంత్ మనస్తాపానికి గురవుతాడని.. ఆయన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా స్పందింస్తున్నారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసిన రోజున మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో .. కేసీఆర్ అన్నదానికి రెట్టింపు అనగలదని అన్నారు. అన్నట్లుగానే కొడంగల్‌లో తన మాట ప్రవాహాన్ని వినిపించారు.
కేసీఆర్‌తోపాటు కేటీఆర్ పైనా ఆయన విరుచుకుపడిన వైనం వైరల్ గా మారింది. కేసీఆర్ కు కాస్త పద్దతిగానే కౌంటర్ ఇచ్చినా.. కేటీఆర్ ను మాత్రం రేవంత్ ట్రీట్ చేసిన వైనం బీఆర్ఎస్ క్యాడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డిని క్యాడర్ అంతా విమర్శిస్తూనే ఉంది. ఆ స్పీడ్ లో ఆయన మాటలు..సీఎం హోదాను అవమానించేలా ఉన్నాయని ప్రారంభించి .. ప్రతి అంశంపై కౌంటర్లు ఇస్తున్నారు. ఘోరంగా తిడితే.. పోలీసులు వస్తారు.. కేసులవుతాయి కాబట్టి వీలైనంత ప్రజాస్వామ్యయుతంగానే కౌంటర్లు ఇస్తున్నారు. నాలుగు రోజులవుతున్నా బీఆర్ఎస్ నేతల స్పందన ఇంకా తీవ్రంగానే ఉంది.
ఈ స్పందన చూసి బీఆర్ఎస్ నేతలంతా.., రేవంత్ స్పీడ్ తో బాగా హర్టయ్యారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.సీఎంగా ఉన్నారని ఆయన మరీ దారుణంగా మాట్లాడలేరని అనుకున్నారు. కానీ కేటీఆర్ మీద వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. సీఎంగా ఉన్నా రేవంత్ ను గౌరవించేది లేదని ఆయన నేరుగా చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే రేవంత్ కౌంటర్ ఇచ్చారు. లాగూల్లో తొండలు వదిలి కొడతామనే పదాలు వాడటం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ను ఆగ్రహానికి చేస్తోంది. అందుకే టెంపో తగ్గకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నీతులు చెబుతూనే ఉన్నారు
