వైసీపీలో పిట్టకథలు చెప్పేవాళ్లు ఎక్కువ. ప్రజలకు మాత్రమే వారు ఆ కథలు చెప్పరు. సొంత పార్టీ వ్యక్తులకూ చెబుతారు. కృష్ణారెడ్డి అనే ఓ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త.. అమెరికాలో చదువో.. ఉద్యోగమో చేస్తూ..బూతుల పోరాటం చేసేవారు. ఆయనకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చాలా తీవ్రమైనదే. చిన్న వయసు. అమెరికాలో వైద్యం అంటే చిన్న విషయం కాదు. కోట్లు కావాలి. అందుకే ఎవరైనా సాయం చేస్తారేమో అని కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు చూస్తున్నారు.
కృష్ణారెడ్డికి ఇప్పుడల్లా తగ్గదని.. సుదీర్ఘమైన ట్రీట్ మెంట్ అవసరం అని తేల్చారు వైద్యులు. అతనికి వైద్య సాయం కోసం ఆయన కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పుడు ఎన్నారై వైసీపీని మేమే నడుపుతున్నాం అని చెప్పుకున్న కొంతమంది ఫోన్లు కూడా ఎత్తలేదు. దాంతో కృష్ణారెడ్డి కుటుంబం నరకయాతన పడింది. చివరికి సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేసుకుని గో ఫండ్ మీ పేజ్ లో పెట్టుకున్నారు. అక్కడా కొంత మంది స్పందించారు. ఈ పెద్దలనుకున్న వాళ్లు మాత్రం స్పందించలేదు.
కానీ వారు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కథలు రాస్తున్నారు. జగనన్న బర్త్ డే వేడుకల కోసం నాలుగైదు దేశాలు తిరుగుతూ ఉండటం వల్ల ఫోన్లు లిఫ్ట్ చేయలేదని కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. అలాంటి వారు చేసుకుంటున్న కవరింగ్ విని వైసీపీ కార్యకర్తలు నిర్వేదానికి గురవుతున్నారు. సాయం ఎందుకు చేయలేదంటే.. ఇన్సూరెన్స్ కృష్ణారెడ్డి కట్టుకోలేకపోయారని.. ఇన్సూరెన్స్ లేకపోతే వైద్యం చేయించుకోవడం అసాధ్యమని అంటున్నారు. అక్కడా సాకే చెబుతున్నారు. గోఫండ్ మీ క్యాంపెయిన్ ఉధృతం చేయాలని సలహాలిస్తున్నారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. కృష్ణారెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏమీ తెలియని స్థితిలో ఉంటే జగనన్న పాటలు వినిపిస్తున్నాం.. అమెరికా ఫ్రెండ్ ను పిలిపించి గిటార్ వినిపిస్తున్నాం అని వీడియోలు పోస్టు చేసి అదే గొప్ప సేవ అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి కథలు చెప్పే వారితో వైసీపీ కార్యకర్తలు బాగుపడినట్లేనని కృష్ణారెడ్డి స్నేహితులు ఫీలవుతున్నారు. ఎక్కడైనా అంతేనని ఈ విషయాలు తెలిసి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మథనపడుతున్నారు. అంతా తెలిసినా పార్టీ హైకమాండ్ నుంచి కూడా భరోసా రాకపోవడం.. పాపం కృష్ణారెడ్డి అనుకునేలా చేస్తోంది.
