ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు రాజకీయాలు బోర్ కొట్టాయి. ప్రతి వారం ఆయన సమకాలిన రాజకీయాలపై ఆర్కే మార్క్ విశ్లేషణ అని కొత్త పలుకు పేరుతో తన అభిప్రాయాలను ఆర్టికల్గా ప్రచురించుకుంటారు. ఈ సారి కూడా ట్యాగ్ లైన్ అదే పెట్టుకున్నారు కానీ రాజకీయాల గురించి చర్చించలేదు. శివాజీకి మద్దతుగా ఉండేందుకు ఆయన చెప్పిన అభిప్రాయాలను బలపరిచేందుకు.. సమాజానికి తన వంతు నీతి సూక్తులు చెప్పేందుకు ఈ వారం సమయం కేటాయించారు. ఎందుకంటే.. సమాజం నుంచి శివాజీకి మద్దతు లభిచిందట.
శివాజీ వాదనను సమర్థించాడనికి ఆర్కే చాలా కష్టపడ్డారు. అవసరం లేకపోయినా ఈ వివాదంలోకి డాక్టర్లను, న్యాయవ్యవస్థను కూడా తీసుకు వచ్చారు. వారు ఇలా కొత్త పద్దతుల్లో నిక్కర్లేసుకుని విధుల్లోకి వెళ్తే బాగుండదన్నారు. డ్రెస్కోడ్లు అనేది పెట్టింది అందుకేనని వాదించారు. శివాజీకీ సపోర్టు బలంగా ఉండటానికి పురాణాల్లోని అంశాలను కూడా అక్కడక్కడ స్పృశించారు. అంతిమంగా ఆయన చెప్పేదేమిటంటే.. ఆయన చెప్పింది తప్పేమీ కాదు.. నాగబాబు, ప్రకాష్ రాజ్ మాత్రం ఆధునిక వీరేశలింగం పంతుళ్లు అని తేల్చారు. శివాజీకి ఉన్నంత స్వేచ్ఛ వారికీ ఉంటుంది కదా!
తన ఆర్టికల్ మొత్తం మీద శివాజీని సమర్థించడానికే ఎఫర్ట్ పెట్టారు ఆర్కే. ఆయన అభిప్రాయాలపై ఆర్కేకు అంత పాజిటివ్ నెస్ ఉండవచ్చు. కానీ తాను చెప్పింది కరెక్టే కానీ పదాలు మాత్రం తప్పే అని శివాజీ కూడా క్షమాపణ చెప్పారు. మరి ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో ?. హీరోయిన్లు అలాంటి డ్రెస్లు వేసుకెళ్లడం వల్లనే మీద పడిపోతారన్నట్లుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఎలాంటి డ్రెస్లు వేసుకెళ్లినా కంట్రోల్ చేయకపోతే అభిమానులు మీద పడిపోతారు. ఈ విషయం చెప్పడానికి ఆర్కే సందేహించారు. కానీ ఫ్యాన్స్ అంటే మీదపడిపోతారన్నట్లుగా చెప్పారు.
ఆర్కే సినిమాల్లో వస్తున్న మార్పుల గురించి తనకు తెలిసిన ఓ ఘటన ద్వారా వివరించారు. హీరోయిన్ స్నానం చేస్తోందన్న డైలాగ్ ను ఒకప్పుడు దర్శకుడు వ్యతిరేకించాడట..ఇప్పుడు స్నానం చేస్తున్నట్లుగా చూపించేస్తున్నారన్నారు. అక్కడే తన మాటల్లోనే ఆర్కే…కాలంతో పాటు వచ్చిన మార్పును గుర్తించాల్సి ఉంది. సమాజం ఆధునికంగా మారుతోంది. దాన్ని ఆహ్వానించకపోతే వెనుకబడిపోయిన ఆలోచనలతోనే ఉంటారు. ఆర్కే కూడా అలాగే ఉన్నట్లుగా ఉంది.
శివాజీకీ సపోర్టు లభించిందని ఆర్కే ఇలా ఈ అభిప్రాయం రాయడానికి తన విలువైన సమయం కేటాయించి ఉంటారు. ఐ బొమ్మ రవికి కూడా సపోర్టు లభించింది. ఆయన చేసిన పనిని సమర్థించగలరా?.

