శ్రీకాళహస్తిలో తమ డ్రైవర్ రాయుడుని ఘోరంగా చంపి చెన్నైలో పడేసి పోలీసులకు దొరికి.. జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన కోట వినుత దంపతులు అడ్డగోలు రాజకీయాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారిని హత్యకేసులో అరెస్టు చేసింది ఇక్కడి పోలీసులు కాదు తమిళనాడు పోలీసులు. పక్కా ఆధారాలతోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మహిళ అన్న కారణంగా కోట వినూతకు త్వరగా బెయిల్ వచ్చింది. ఆమె భర్త చంద్రబాబు చాలా కాలం జైల్లో ఉన్నారు.బయటకు వచ్చాక రాజకీయాలతో రచ్చ చేస్తున్నారు.
ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తే ఎమ్మెల్యే స్థాయి నేత అవుతారా?
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఈ దంపతులు టార్గెట్ చేసుకుంటున్నారు. లేనిపోని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. సుధీర్ రెడ్డికి తామే ప్రత్యర్థులం అన్నట్లుగా కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ డ్రైవర్ ను బెదిరించి వీడియో తీయించి చంపేశారన్నది జరిగిన క్రైమ్ సీన్ ను బట్టి అర్థమవుతూనే ఉంది. అదే విషయాన్ని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. అయినా బయిల్ పై బయటకు వచ్చి సుధీర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టారని అదని.. ఇదని ఆరోపిస్తున్నారు. అసలు దేనికీ బేస్ ఉండదు.
దుందుడుకు మాటలతో మీడియాను దూరం చేసుకున్న సుధీర్ రెడ్డి
సుధీర్ రెడ్డి .. కోట వినుత దంపతుల్ని ప్రత్యర్థులుగా ఎప్పుడూ చూడలేదు. అయితే ఆయన వ్యవహారశైలి కారణంగా మీడియాకు దూరమయ్యారు. ఓ ప్రధానపత్రికను గతంలో దూషించడంతో ఆ పత్రిక కూడా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది. చెన్నై పోలీసులు సుధీర్ రెడ్డిని ప్రశ్నిస్తారని ఇటీవల వార్త ప్రచురించింది. దాంతో ఆయనే అనుమానితుడని కోట వినుత వర్గీయులు ప్రచారం ప్రారంభించారు. అక్కడ జరిగింది వేరు. చెన్నై పోలీసులు వచ్చి కొంత మంది నుంచి సమాచారం సేకరించి వెళ్లారు. మీడియాతో పాటు ఇతర నేతలతో సఖ్యతగా ఉండకపోవడం వల్ల సుథీర్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
కోట వినుత దంపతుల రాజకీయం ఎప్పుడూ వివాదాస్పదమే
జనసేన పేరుతో రాజకీయాల్లోకి వచ్చినా ఆ దంపతులు చేసే రాజకీయం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. తనపై దాడులు జరిగాయని గతంలో చాలా సార్లు ఆరోపించారు. అప్పట్లో వైసీపీ నేతలు దాడులు చేసేవారని ఆరోపించేవారు. జనసేన తరపున పోటీ చేసి నాలుగు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. జనసేన పార్టీ సస్పెండ్ చేసినా ఆ పార్టీ పేరుతోనే రచ్చ చేస్తున్నారు. రేపు వైసీపీలో చేరి పవన్ కల్యాణ్ పై … పోతిన మహేష్ లాగా ఆరోపణలు చేసినా ఆశ్చర్యం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
