రాని యాత్రీకులు – ఏర్పాట్ల చికాకులు

గోదావరి అంత్య పుష్కరాలకు వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకి లక్షన్నర వుంటుదన్న అంచనాతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. యాత్రీకుల కంటే బందోబస్తుకి వచ్చిన పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగుల సంఖ్యే బాగా కనిపిస్తోంది.

హిందువుల విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం తరతరాలుగా ప్రచారాలకు అతీతంగా జరిగిపోయే పుష్కరాల్లో యాత్రికులకు వసతి సౌకర్యాలు, పారిశుధ్య ఏర్పాట్లు కు మాత్రమే మొదట్లో ప్రభుత్వాలు పరిమితమయ్యాయి. ప్రజల ఆదరాభిమానాలకోసం రానురానూ సన్నాహాల్లో ప్రభుత్వ జోక్యాలు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడైతే పుష్కరాలను ఫెస్టివ్ ఈవెంటుగా మార్చేశారు. పుష్కరాలతో ముడిపడి న వేర్వేరు సర్వీసుల్లో, వ్యాపారాల్లో వున్న వేలాదిమందికి లక్షల రూపాయల ఆదాయాలు సమకూర్చే ఎకనమిక్ స్టిమ్యులేటర్ లా ఈ ఈవెంటును మార్చేశామని గోదావరి ఆది పుష్కరాల్లో స్వయంగా చంద్రబాబే వివరించారు.

అయితే రాష్ట్రప్రభుత్వం ఆశించినట్టు ఆది పుష్కరాలకు కేంద్రప్రభుత్వం ఒక్కరూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. అలాగే ఇపుడు అంత్య పుష్కరాలకు రాష్ట్రప్రభుత్వం కూడా ఒక్కరూపాయైనా విడుదల చేయలేదు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నిధులను, జిల్లా కలెక్టర్ మంజూరు చేసే నిధులను ఇందుకు ఖర్చుచేస్తారు.

ఆది పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయిన సంఘటనను దృష్టిలో వుంచుకుని రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలు అతి జాగ్రత్తలు తీసుకున్నాయి. జనం లేని గోదావరి గట్టు రోడ్డుని బారికేడ్లలో బంధించేశారు. వాహనాల రాకపోకలను ఆపేసి ప్రజల్ని కిలోమీటర్లకొద్దీ నడిపిస్తూ ఆయాసపెడుతున్నారు.

పురాణాల ప్రకారం…బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి ఏడాదికి ఒకొక్క నదిలో పన్నెండేసి రోజుల పాటు వుండాలని ఆదేశించాడు. అరోజులే ఆయానదుల పుష్కరాలు. గౌతమిలో మాత్రం పన్నెండురోజులకి అదనంగా రోజూ మధ్యాహ్నం రెండు ఘడియలు, తిరిగి చివరి పన్నెండురోజులూ పూర్తిగానూ వుండాలని ఆదేశించాడు. ఇందువల్లే మరేనదికీ లేని విధంగా చివరి పన్నెండు రోజులూ గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలయ్యాయి.

ఆది పుష్కరాల్లో పిండప్రధానాలు చేయడానికి రకరకాల మైలల వల్లా, ఇతర కారణాలవల్లా అవకాశం లేనివారు అంత్య పుష్కరాల్లో తీర్ధవిధులు నిర్వహిస్తారు. దక్షిణ కాశిగా నమ్మే రాజమహేంద్రవరంలో యాత్రికులు, తీర్ధవిధులు నిర్వహించేవారు, పుణ్యస్నానాలు చేసేవారు, నదే ఆధారంగా జీవించే వృత్తులవారు రోజూ 5 వేల మంది వేర్వేరు రేవుల్లో స్నానాలు చేస్తూ కనబడుతారు. పండగరోజుల్లో ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుంది. అంత్య పుష్కరాల్లో ఐదింతలు వుంటుంది. అయినా కూడా ఇపుడున్న యాత్రీకుల సంఖ్య కార్తీకమాసంలో, మహాశివరాత్రి నాడు గోదావరి స్నానాలు చేసేవారి కంటే తక్కువే!

2003 లో జరిగిన గోదావరి అంత్య పుష్కరాలకు పెద్ద ప్రచారం వచ్చింది. మంత్రి జక్కంపూడి రామమోహనరావు చొరవతో అపుడు అంత్య పుష్కరాల సమయంలోనే గోదావరి ఉత్సవం కూడా నిర్వహించారు. అలా అంత్యపుష్కరాలకు హైప్ వచ్చింది.అప్పటిలాగే గోదావరి ఉత్సవాలను కూడా కలిపి నిర్వహించడానికి రెండుకోట్ల రూపాయలు ఖర్చకాగల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. నిధుల కొరత వల్ల గోదావరి ఉత్సవాలను వాయిదావేసుకోవాలని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి సూచించారు.

అయినాగాని మితిమీరిన అతి బందోబస్తుతో అధికారులు పోలీసులు యాత్రికుల ప్రయాసల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. స్ధానికుల్ని విసిగిస్తున్నారు.

మరోవైపు గోదావరి అంత్యపుష్కరాల సన్నాహాలు ఏర్పాట్ల ”ఘనంగా” ఉన్నాయన్న వార్తలతో ఒక పెద్ద దినపత్రిక, ”పూర్తిగా విఫలం” అన్నవార్తలతో మరొక పెద్ద దినపత్రిక ప్రజల్ని గందరగోళంలోకీ తోసేస్తున్నాయి. అయోమయంలో ముంచేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close