గత సినిమాలకంటే అల్లు శిరీష్ కొంత బెటర్‌గా కనిపిస్తున్నాడు. శ్రీరస్తు – శుభమస్తు ట్రైలర్లు చూసినవాళ్లంతా చెబుతున్నమాట ఇదే. సినిమా సినిమాకీ మార్పు సహజమే. అయితే అది ఈసారి ఇంకాస్త ఎక్కువగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే.. మిగిలినవాళ్లకు లేనిపోని డౌట్లు వస్తున్నాయి. అల్లు శిరీష్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నాడని, అందుకే ఆ మార్పన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. మెగా ఇంట్లో ఇలాంటి సర్జరీలు మామూలే. రామ్‌చరణ్‌కీ, బన్నీకీ ఇలాంటి చిన్న చిన్న సర్జరీలు జరిగాయని చెబుతుంటారు. ఇప్పుడు శిరీష్ కూడా అలానే చేయించుకొన్నాడని టాక్.
అయితే అల్లు శిరీష్ సన్నిహితులు మాత్రం ఈ వార్తల్ని కొట్టి పరేస్తున్నారు. అల్లు శిరీష్ మేకొవర్ సహజంగానే జరిగిందని,అందులో కృత్రిమత్వం ఏమీలేదన్నది వాళ్లమాట. ఫిట్నెస్ కాపాడుకోవడం, జిమ్, యోగా… ఇవన్నీ శిరీష్‌లో మార్పు తీసుకొచ్చాయట. దాంతో పాటు కాస్ట్యూమ్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం వల్ల.. కొత్తగా కనిపిస్తున్నాడట. డ్రస్సులు మారిస్తే లుక్‌లో మార్పు వస్తుంది. జిమ్ చేస్తే బాడీ మారుతుంది.. మరి ఫేస్ ఎలా మారిందబ్బా?? అనేదే అందరి డౌటు. మరి శిరీష్ ఏమంటాడో చూడాలి.