చిరంజీవి సినిమా అంటే డాన్సులు అదిరిపోవాల్సిందే. సిగ్నేచర్ స్టెప్పులకు చిరు సినిమాలు పెట్టింది పేరు. హిట్లర్‌లో అబిబీ.. అబిబీ.. తో సిగ్నేచర్ స్టెప్పు పరిచయం చేశాడు చిరు. ఆ తరవాత ఇంద్ర లో వీణ స్టెప్పు షేక్ చేసేసింది. అప్పటి నుంచీ.. ప్రతీ పాటలో ఓ సిగ్నేచర్ స్టెప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు స్టార్ హీరోలు. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమాలో స్టెప్పులు అదిరిపోయేలా ఉండాలని చిరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దాంతో పాటు చిరు కూడా స్టెప్పుల విషయంలో అభిమానుల్ని శాటిస్పై చేయాలని భావిస్తున్నాడు. అందుకే లారెన్స్‌కు కబురంపాడట.
చిరుతో వైవిధ్య భరితమైన స్టెప్పులు వేయించాడు లారెన్స్. దర్శకుడిగా బిజీ అయ్యాక… డాన్స్ డైరెక్షన్ పక్కన పెట్టాడు. అయితే చిరుమీదున్న ప్రత్యేక అభిమానంతో ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేయడానికి ఓకే అన్నాడట. కీలకమైన పాట లారెన్స్‌కు అప్పగించాడట చిరు. ఇంకేముంది?? చిరు కోసం సిగ్నేచర్ స్టెప్పులు రెడీ అవుతున్నాయి. అటు దేవిశ్రీ సంగీతం, ఇటు లారెన్స్… చిరు రెచ్చిపోవడం ఖాయమే కదా??