నందమూరి బాలకృష్ణకూ మంచు కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మంచు మనోజ్‌కు. ‘ఊ కొడతారా – ఉలిక్కి పడతారా’ లో ఓ కీలక పాత్ర పోషించారు బాలయ్య. ఆ సమయంలో ఆయన పారితోషికం కూడా తీసుకోలేదట. ఇప్పుడు బాలయ్య సినిమాలో మనోజ్ నటించే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మనోజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్. ఆ పాత్ర కాస్త నెగిటీవ్ షేడ్ లో ఉంటుందని సమాచారం. ‘మిరాయ్’లో పూర్తి స్థాయి విలన్ గా దర్శన మిచ్చాడు మనోజ్. అప్పటి నుంచి తనకు ఆ తరహా పాత్రలు వస్తూనే ఉన్నాయి. అయితే.. సరైన క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. బాలయ్య సినిమా కాబట్టి.. నెగిటీవ్ షేడ్ ఉన్నా సరే.. మనోజ్ ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. ఇటీవలే గోపీచంద్ మలినేని – మనోజ్ మధ్య భేటీ జరిగిందని, మనోజ్ కి కథ చెప్పారని, మనోజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈనెలలోనే చిత్రీకరణ మొదలయ్యే ఛాన్స్ వుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
