తొలి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించేసుకొంది అనుష్క. ఓ హిట్టు పడగానే.. ఏకంగా కోటి రూపాయల పారితోషికానికి ఎగబాకింది. ఈ పదేళ్ల కెరీర్లో అనుష్క సంపాదన ఎంత? ఎన్ని కోట్లు కూడబెట్టింది? ఈ విషయాలపై అనుష్క స్వయంగా సమాధానం చెప్పింది. ”నేనో స్టార్ హీరోయిన్నే కావొచ్చు. ఎక్కువ సినిమాలు చేసుండొచ్చు. కానీ సంపాదన విషయంలో నేను చాలా పూర్…” అంటోంది అనుష్క. అదేంటి ? అని అడితే.. ”నేను పది రూపాయలు సంపాదిస్తే ఆ పదీ ఖర్చు పెట్టేసే రకమే. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాచుకోవాలి.. అనే వివరం తెలిసేది కాదు. పైగా నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది. వాళ్ల అవసరాలన్నీ నేనే చూసుకొంటారు. ఎవ్వరూ నోరు విడచి అడగరు. కానీ.. వాళ్లకేమైనా కావాలేమో అని నేనే కొని ఇచ్చేస్తుంటా. ప్రతీ రోజు ఎవరికో ఒకరికి గిఫ్టులు కొంటుంటా” అంటోంది అనుష్క.
పారితోషికం ఇవ్వడంలో పిసినారితనం చూపిస్తూ.. ఎగ్గొట్టేవాళ్లనీ అనుష్క చూసిందట. ”కొంతమంది ముందు ఒక అంకె చెబుతారు. చివర్లో మరోటి ఇస్తారు. అడిగినంత పుచ్చుకోవడం, నిర్మాతల్ని విసిగించడం నాకింకా చేతకాలేదు. పోనీలే.. వాళ్లెన్ని కష్టాలు పడుతున్నారో అని వదిలేస్తుంటా. అందుకే పెద్దగా సంపాదించుకోలేదు. కానీ నా బ్యాంకు బాలెన్స్తో సంతృప్తిగానే ఉన్నా” అంటోంది అనుష్క. తన సిబ్బందికి ఫ్లాట్లు కొనిపెట్టిందట. మేకప్మెన్కి సైతం ఓ ఇల్లు కట్టించిందట. అందుకే అనుష్క గురించి అంతా ఇంత గొప్పగా చెబుతుంటారు.