ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాత సినిమా ఏమిటి? ఎవరితో.. వీటికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్ ఇవి.
ఎన్టీఆర్ వక్కంతం వంశీ కథకు ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. అక్టోబరులో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. రెగ్యులర్ షూటింగ్ నవంబరులో మొదలవుతుంది. 2017 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అన్నట్టు ఇందులో కల్యాణ్ రామ్ కూడా నటించనున్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల వక్కంతం ఎన్టీఆర్‌ని కలిసి ఫుల్ గా స్క్రిప్టుని నేరేట్ చేశాడట. వెంటనే ఎన్టీఆర్ కూడా డేట్లు ఎలాట్ చేసినట్టు టాక్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పారితోషికం ఏమీ తీసుకోవడం లేదన్న టాక్ వినిపించింది. అయితే ముందస్తుగా ఎన్టీఆర్‌కి కొంత అడ్వాన్స్ రూపంలో ఇచ్చి.. ఆ తరవాత బిజినెస్ అయిన తరవాత లాభాల్లో వాటా అందుకొంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక కోసం అన్వేషణ మొదలెంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌లో గెడ్డం లుక్‌లో కనిపించాడు ఎన్టీఆర్. వక్కంతం సినిమా కోసం కొత్త స్టైల్లో కనిపించబోతున్నాడట. అందుకోసం నెల రోజుల సమయం తీసుకోనున్నాడని తెలుస్తోంది.