సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరో కూడా చేయనన్ని సినిమాలు చేశాడు కానీ వాటిల్లో కొన్ని సినిమాలు మాత్రమే నిలబడ్డాయి. వందకు పైగా సినిమాలు ఏ ఒక్కరికీ తెలియకుండానే పోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణకు గొప్ప స్థానాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఆ గొప్ప సినిమాలను మహేష్ బాబుతో రీమేక్ చేద్దామని తెలుగు సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువమంది కమర్షియల్‌గా క్యాష్ చేసుకుందామనే ఇంటెన్షన్‌తోనే ఉన్నారు కానీ ఎస్.ఎస్. రాజమౌళి లాంటి వాళ్ళు మాత్రం కమర్షియల్ లెక్కలతో పాటు సబ్జెక్ట్స్‌ని కూడా ఇష్టపడుతున్నారు. రాజమౌళి దర్శకత్వ శైలిని చూసుకుంటే ఆయన మరీ ఎక్కువ వెరైటీ సినిమాలు అయితే తీయలేడు. ఆయన దర్శకత్వ శైలికి కరెక్ట్‌గా సరిపోయే జేమ్స్‌బాండ్ సినిమాని మహేష్‌తో రీమేక్ చేయాలని జక్కన్న ప్లాన్ చేశాడు. అయితే అలాంటి ఐడియాస్కి మహేష్ బాబు ఆదిలోనే చెక్ చెప్పాడు. నాన్నగారి క్లాసిక్స్‌ని టచ్ చేసే ఉద్ధేశ్యం లేదని చెప్పాడు. ఆ తర్వాత రాజమౌళి కూడా సైలెంట్ అయ్యాడు.
అయితే ఇప్పుడు మళ్ళీ అల్లూరి సీతారామరాజుకు ప్రీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి. స్టోరీ ఐడియా వరకూ చాలా బాగుంది. ఉద్యమకారుడిగా అల్లూరి సీతారామరాజు జీవితాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా డేరింగ్ అండ్ డైనమిక్ కృష్ణ అద్భుతంగా కళ్ళకు కట్టాడు. తెలుగు సినిమా చరిత్రలో ఒన్ ఆఫ్ ది బెస్ట్‌గా అల్లూరి సీతారామరాజు ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అలాంటి అల్లూరి సీతారామరాజుకు ప్రీక్వెల్ ఐడియా కూడా బాగుంది. యోధుడిగా మారక ముందు అల్లూరి సీతారామరాజు ఎలా పెరిగాడు? ఎలాంటి ఆలోచనలతో ఉండేవాడు? ఎందుకు ఉద్యమం వైపుగా అడుగులేశాడు? రామరాజు బాల్యానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ కలిగిస్తాయనడంలో సందేహం లేదు. కానీ అలాంటి గొప్ప సబ్జెక్ట్‌ని టేకప్ చేయాలనుకున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణలాగే సీతారామరాజు చిన్న నాటి క్యారెక్టర్‌కి జీవం పోసే స్థాయి ఆర్టిస్ట్‌ని తీసుకుంటే బాగుంటుంది. క్రేజ్ కోసమనో, కమర్షియల్ లెక్కలు వేసుకునో మహేష్ కొడుకుతో సినిమా తీయడమంలే కథను చంపేయడమే. కమర్షియల్ కథలైతే వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ చారిత్రక పురుషుడి జీవితాన్ని తీస్తున్నామన్నప్పుడు కొన్ని బేసిక్స్, ఇంపార్టెంట్ విషయాల్లో కథకే ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే పరిస్థితి మొహెంజోదారోతో పాటు బాలీవుడ్ తీసిన ఇంకా బోలెడన్ని హిస్టారికల్ సినిమాల్లో అయిపోతుంది పరిస్థితి. తేడా వస్తే గౌతమ్ కెరీర్‌కి హెల్ప్ అయ్యే విషయం ఏమో కానీ జీవితాంతం అవమాన భారాన్ని మోయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రామరాజు బాల్యాన్ని తెరకెక్కించాలి అన్న ఆలోచనను మాత్రం ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అభినందించాలి కూడా. కానీ అంతటి గొప్ప కథను చిత్తశుద్ధితో కథను, క్యారెక్టర్ని బ్రతికించడం కోసమే సినిమా తీయండి అని కోరుకోవడంలో మాత్రం తప్పులేదు.