మన మీడియా వాళ్ళు ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా ఓ బ్రాండ్ వేసి వదులుతూ ఉంటారు. రజినీకాంత్, పవన్ కళ్యాణ్…సన్యాసుల్లాగా బ్రతుకుతారని, ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని, వెంకటేష్…ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటాడని, చిరంజీవి చాలా సామ్యుడని…ఇలా ప్రతి స్టార్‌కి ఓ బ్రాండ్ వేసి వదులుతారు. ఆ స్టార్స్ మాట్లాడే ప్రతి మాటను, బిహేవియర్‌ని ఆ అద్దాల్లోంచే చూస్తుంది. వాస్తవం ఏంటంటే స్టార్స్ ఇమేజ్‌కి సంబంధించి మీడియా చెప్పే మాటల్లో కూడా కొంతే నిజం. కొంత అబద్ధం.
ఈ ఉపోద్ఘాతాన్ని పక్కన పెట్టేస్తే సమంతా, నాగచైతన్య ప్రేమలో ఉన్నారు. అది అఫిషియల్ సీక్రెట్. వీళ్ళిద్దరిలో సమంతానేమో చాలా స్పీడ్ అని, అన్ని విషయాలు చాలా ఓపెన్‌గా చెప్పేస్తుందని…సమంతా అలా ఓపెన్‌గా చెప్పడం నాగార్జునకు ఇష్టం లేదని, చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడని….అబ్బో నచ్చినట్టుగా వార్తలు….సారీ ఊహాగానాలు రాసిపడేశారు.
ఇక చైతన్య గురించేమో చాలా సైలెంట్ అని, సమంతాతో లవ్‌లో ఉన్న విషయం గురించి కనీసం ఫ్రెండ్స్‌తో కూడా డిస్కస్ చేయలేదని, ఎవ్వరు ఏం అడిగినా, ఎవ్వరితోనూ ఏమీ చెప్పడానికి ఇష్టపడడం లేదని, ప్రైవసీ కోరుకుంటున్నాడని….ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ఊహించేసుకున్నారు, రాసేశారు. ఇకపై ఎక్స్పోజింగ్ చెయ్యొద్దని సమంతాకు నాగ్ వార్నింగ్ ఇచ్చాడని రాశారు. ఆ విషయం పచ్చి అబద్ధమని ఫారెన్ టూర్లో తను దిగిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రూవ్ చేసింది సమంతా. ఈ గ్యాప్‌లోనే అమలా పాల్ విడాకులకు కూడా సమంతానే కారణం అనే రేంజ్లో మనవాళ్ళు రాసిపడేశారు. అది నిజమని ప్రూవ్ చేయడానికి ఓ ఫన్నీ లాజిక్ కూడా తీశారు. అన్నింటికీ తన డ్రెస్సింగ్, జనతాలో కనిపించిన విధానంతో ఘాటుగా ఆన్సర్ ఇచ్చేసింది సమంతా.
ఇప్పుడు చైతన్య కూడా అదే చేశాడు. వెంకటేష్ సినిమాల్లో ఏది ఇష్టం అని సమంతా అడిగితే ‘ఇంట్లో ఇల్లాలు…వంటింట్లో ప్రియురాలు’ అని చెప్పాడు. అది చాలు నాగచైతన్య ఏ స్థాయి సరసుడో చెప్పడానికి. ఆ తర్వాత రానా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చైతూ ఫ్రెండ్సందరికీ అసలు విషయం తెలుసన్న క్లారిటీ ఇచ్చింది. రామానాయుడు, అక్కినేని ఫ్యామిలీస్‌లో రానా, చైతన్యది సెపరేట్ బంధం. ఇద్దరూ కూడా మిగతా అందరికంటే చాలా క్లోజ్‌గా ఉంటారు. రానా ట్వీట్స్లోనే మనవాడికి మొత్తం విషయం తెలుసన్న విషయం అర్తమవుతోంది. అలాగే ఈ రోజు ఆటాడుకుందాం…రా సినిమా ప్రమోషన్ వీడియోలో కూడా తన సైలెన్స్‌తో, మాటలతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా విషయాలు చెప్పేశాడు చైతూ. సమంతాను ఏ రేంజ్లో ఇష్టపడుతున్నాడో కూడా చైతూ మొహంలో తెలిసిపోతోంది.
అసలు విషయం ఏంటంటే సమంతా కొంచెం వాగుడుకాయ టైప్. చైతన్య సైలెంట్ కిల్లర్…. అంతే తేడా. సమంతా అన్ని విషయాలు కూడా మాటల్లో చెప్పేస్తోంది కాబట్టి అందరికీ సింపుల్‌గా అర్థమైపోతోంది. చాలా తెలివిగా ఫ్రెండ్స్‌కి, క్లోజ్ సర్కిల్ పీపుల్‌కి మాత్రమే పూర్తిగా అర్థమయ్యేలాగా ప్రేమ విషయాన్ని చెప్పేస్తున్నాడు చైతన్య. చైతన్య మాటలు, ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మాత్రం అనిపిస్తోంది ఒక్కటే. అక్కినేని చైతన్య కూడా సరసుడే అని. సమంతాను ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదని. సమంతా ఏదో మాయ చేసి చైతన్యను పడేసింది అనే యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం లేదని.