నిన్నా మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ అభిమానులు తెగ బాధపడిపోయారు. 2019 ఎన్నికల తరవాత పవన్ కల్యాణ్ సినిమాలు చేయడేమో అని, రెండు మూడు సినిమాల తరవాత పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడేమో అని కంగారు పడ్డారు. దానికి తోడు పవన్ కూడా ‘సినిమాలపై మనసు లేదు’, ‘సినిమాలు మానేస్తా’ అనే టైపులోనే మాట్లాడేవాడు. వాటిపై ఈరోజు క్లారిటీ వచ్చేసింది. పవన్ సినిమాల్ని మానేయడం లేదు. సినిమాలు కొనసాగిస్తాడు. ఈ విషయాన్ని తిరుపతి సభలో చెప్పేశాడు కూడా. ‘సినిమాలు మానేయను.. చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా దగ్గర డబ్లుల్లేవు..’ అంటూ అభిమానులకు తీపి కబురు అందించాడు.
పవన్ కల్యాణ్ తిరుపతి సభ సక్సెస్ అయ్యిందా, లేదా? ఈ సినిమాతో పవన్‌కి పొలిటికల్ మైలేజీ ఎంతొచ్చింది అనేది పక్కన పెడితే ఇండ్రస్ట్రీ వర్గాలకూ, పవన్ కల్యాణ్ కోసం కథలు సిద్దం చేసుకొంటున్న దర్శకులకూ ఇది తీపి వార్తే. ఎందుకంటే ఇండ్రస్ట్రీ రికార్డుల్ని తిరగరాయగల సత్తా ఉన్న కథానాయకుడు పవన్ కల్యాణ్. ఎంతకాదన్నా మరో ఐదారేళ్లు కథానాయకుడిగా తన హవా చూపించే స్టామినా ఉంది. అలాంటి హీరో రాజకీయాల్లో పడి సినిమాలకు దూరమైతే.. పరిశ్రమకు లోటుగా కనిపించేది. పవన్ కూడా సినిమాలకు దూరం అవ్వాలని గట్టిగా నిర్ణయించుకొన్నవాడే. ఈ షార్ట్ గ్యాప్‌లో ఏమైందో.. ఏమో, మళ్లీ సినిమాలు చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఫ్యాన్స్ కీ, దర్శకులుకూ.. ఇది కచ్చితంగా శుభవార్తే.