రన్ టైమ్ విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. నిడివి ఏమాత్రం ఎక్కువైనా… జనాలకు `బోర్` కొట్టేస్తోంది. స్టార్ హీరో సినిమా అయినా సరే.. ల్యాగ్ ఎక్కువైతే స్టార్ సినిమా అయినా సరే.. కనికరించడం లేదు. అందుకే జనతా గ్యారేజ్ రన్ టైమ్ విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. ఒకటికి పదిసార్లు సీన్లు చెక్ చేసుకొని నిడివి తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. మోహన్ లాల్‌కి సంబంధించిన రెండు సీన్లను కత్తిరించేశార్ట. అవి.. మలయాళంలో మాత్రం చూడొచ్చు. అలానే అజయ్, బ్రహ్మజీలపై తెరకెక్కించిన సీన్లు కూడా ట్రిమ్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి చివరి నిమిషాల్లో 6 నిమిషాల నిడివి తగ్గినట్టు సమాచారం. అలా తగ్గించాకే.. రన్‌టైమ్ కాస్త కంట్రోల్‌కి వచ్చిందట. ఇప్పుడు ఈ సినిమా 2గంటల 25 నిమిషాలకు కుదించారని తెలుస్తోంది.
బుధవారం ఫ్యాన్స్ షోలకు సంబంధించిన హంగామా కూడా అప్పుడే మొదలైపోయింది. అర్థరాత్రి 12 గంటలకు షో ఉంటుందా? లేదంటే తెల్లవారుఝామున 4 గంటలకు వేద్దామా అనే విషయంలో చిత్రబృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాని తెల్లవారుఝామున ప్రదర్శించారు. అదే సెంటిమెంట్ జనతా గ్యారేజ్ విషయంలోనూ పాటించే అవకాశాలున్నాయి.