పవన్ కల్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెడుతున్నాడనగానే అందరి దృష్టీ అటువైపుకు మళ్లింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే.. చలో తిరుపతి అంటూ అప్పటికప్పుడు పరుగులు తీశారు. పవన్ సభ ఎఫెక్టు వల్ల హైదరాబాద్ – తిరుపతి ఫ్లైట్ ఛార్జీలకూ సడన్‌గా రెక్కలొచ్చేశాయి. రేట్లు డబుల్, త్రిపుల్ అయిపోయాయి. పవన్ ఏం మాట్లాడతాడో, ఈసారి ఎవరికికౌంటర్ ఇస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. రాజకీయ పార్టీలూ అటు వైపు దృష్టిపెట్టాయి. మరి అన్నయ్య చిరంజీవి ఏం చేశాడు? పవన్ సభ తిలకించాడా, పవన్ మాటల్ని విన్నాడా?
శనివారం ఖైదీ నెం.150 షూటింగ్లో బిజీగా ఉన్నాడు చిరు. అయితే పవన్ సభ సమయానికి షూటింగ్‌ని క్యాన్సిల్ చేసి.. కార్ వ్యాన్‌లోకి వెళ్లిపోయాడట చిరు. క్యార్ వేన్లో టీవీ ద్వారా పవన్ సభని చివరి వరకూ వీక్షించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీటింట్ అవ్వగానే క్యార్ వ్యాన్‌లోంచి బయటకు వచ్చేసిన చిరు.. యధావిధిగా షూటింగ్ ని కంటిన్యూ చేశాడట. తన ప్రస్తావన లేకపోవడం, తనని టార్గెట్ చేయకపోవడం, స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కాస్త గట్టిగానే మాట్లాడడంతో అన్నయ్య కూడా ఖుషీ అయ్యాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.