నాగచైతన్య – సమంతల బంధం రోజురోజుకీ బలపడుతోంది. వీళ్లమీద వచ్చిన పెళ్లి పుకారు.. నిజం అవ్వడానికి ఎంతో దూరం లేదన్న గుసగుసలూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే నాగార్జున, సమంతని కలిసినట్టు పెళ్లి గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. సమంతని తన కుటుంబంలోని నాగ్ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు అందుకు సాక్ష్యం దొరికింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు సమంత, నాగచైతన్య జంటగా హాజరయ్యారు. అక్కడే నాగార్జున, అఖిల్‌లు కూడా కనిపించారు. ఈ నలుగురూ కలసి చాలాసేపు నవ్వుతూ ముచ్చటించుకొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సమంతని కోడలుగా స్వీకరించడానికి నాగ్ సిద్ధమయ్యారన్న ప్రచారానికి ఈ ఫొటోలు మరింత బలాన్ని చేకూర్చాయి. డిసెంబరులోనే సమంత, చైతూ వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు నిర్ణయించుకొన్నాయని, త్వరలోనే నిశ్చితార్థం కోసం ముహూర్తం నిర్ణయిస్తారని సమాచారం.