మిర్చి తరవాత రామ్ చరణ్‌తోనే సినిమా చేయాల్సింది కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ సెట్టయి… సెట్స్‌పైకి వెళ్లేలోగా ఆగిపోయింది. `కథ బాలేదు..` అంటూ చరణ్ వంక చెప్పి తప్పించుకొన్నాడని అప్పట్లో టాక్ వినిపించింది. శ్రీమంతుడు సూపర్ హిట్ అయ్యాక.. మళ్లీ చరణ్ – కొరటాల కాంబినేషన్ వార్తల్లో నిలిచింది. ఈసారి చరణ్, కొరటాల శివ కలసి పనిచేయడం ఖాయం అనుకొన్నారు.కానీ.. అప్పుడూ కుదర్లేదు. ఈసారీ రామ్‌చరణే అడ్డు తగిలాడని చెప్పుకొన్నారు. జనతా గ్యారేజ్ తరవాత కొరటాల 4వ సినిమాగా చరణ్ కాంబినేషన్ సెట్టయ్యిందనుకొన్నారు. అయితే.. ఇప్పుడూ చరణ్ హ్యాండిచ్చాడు. అందుకే రామ్‌చరణ్‌పై కొరటాల కాస్త అసంతృప్తితో ఉన్నాడట. ఇకమీదట చరణ్‌తో కలసి పనిచేయకూడదని, చరణ్ పిలిచినా వెళ్లకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
ఈమధ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన కొరటాల శివ.. చరణ్ సినిమా గురించి అడిగితే పెద్దగా స్పందించలేదు. ”అందరు హీరోలతోనూ చేయాలని వుంది” అంటూ మొక్కుబడిగా సమాధానం చెప్పేశాడు. అయితే.. కొరటాల మాత్రం చరణ్ తో సినిమా చేయకూడదని బలంగా ఫిక్సయ్యాడని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మీడియా ముందు తన కోపం వెళ్లగక్కడం ఎందుకని కొరటాల కామ్ గా ఉన్నాడట. పైగా ఇండ్రస్ట్రీలో ఎప్పుడు ఎవరితో చేతులు కలపాల్సివస్తుందో చెప్పలేం. అందుకే చరణ్ సినిమా విషయంలో శివ మౌనం దాల్చాడని టాక్.