అల్లు అర్జున్ సినిమా డీజే – దువ్వాడ జగన్నాథమ్ ఈరోజే పట్టాలెక్కింది. బన్నీ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ప్రకటించే వరకూ టైటిల్ ఎక్కాడా బయటకు పొక్కలేదు. సాధారణంగా బడా హీరోల సినిమాల విషయంలో టైటిళ్లు లీకైపోతుంటాయి. అయితే అలాంటి ప్రమాదం జరక్కుండా… పక్కా ప్లాన్‌గా వ్యవహరించింది చిత్రబృందం. ఆదివారం మంచి ముహూర్తం చూసుకొని, అప్పుడు టైటిల్ లోగోని బయటకు వదిలారు. ‘దువ్వాడ జగన్నాథమ్’ ఏంటి?? అంటూ ముందు చాలామంది అవాక్కయ్యారు. డీజే అంటూ పాష్ టైటిల్‌కి క్యాప్షన్ కాబట్టి.. ఆ తరవాత `కొత్తగా ఉందిలే` అని సర్దుకుపోయారు. కానీ.. ఈ టైటిల్ గురించి బన్నీకి కొంచెం అనుమానాలు ఉన్నట్టున్నాయి.
అందుకే ‘టైటిల్ ఎలా ఉంది బ్రదర్’ అంటూ తన సన్నిహితుల నుంచి, కొంతమంది మీడియా మిత్రుల నుంచి బన్నీ ఫీడ్ బ్యాక్ తీసుకొన్నట్టు సమాచారం. వాళ్లు కూడా పాజిటీవ్‌గా స్పందించడంతో బన్నీ సంతృప్తిపడ్డాడట. నిజానికి ‘డీజే’ అనే టైటిల్ ఒక్కటే పెడదాం అని బన్నీ భావించినా, హరీష్ శంకర్ మాత్రం పట్టుబట్టి దువ్వాడ జగన్నాథమ్ అనే క్యాప్షన్ కూడా వదిలినట్టు సమాచారం. బడా హీరోల సినిమాల వరకూ దాదాపుగా టైటిల్ ముందుగా ఎనౌన్స్ చేయరు. ఆడియో విడుదలకు ముందు అధికారికంగా ఫిక్స్ చేస్తారు. ఈలోగా మంచి టైటిల్ వెదికి పట్టుకోవడానికి కావల్సినంత టైమ్ దొరుకుతుందని. కానీ… ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం ఆ టైటిల్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి, ముందుగా బయటపెట్టాల్సివచ్చింది. విడుదలకు ముందు టైటిల్ చెబితే.. అప్పుడు బన్నీ ఫ్యాన్స్ నెగిటీవ్‌గా రియాక్ట్ అయితే, టైటిల్ మార్చడానికి కూడా టైమ్ దొరకదు. అందుకే… కొబ్బరికాయ్ కొట్టే ముందే టైటిల్ చెప్పేశారన్నమాట. టైటిల్‌పై వచ్చిన ఫీడ్ బ్యాక్ పట్ల బన్నీ సంతోషంగా ఉన్నాడు. బన్నీ ప్లాన్ వర్కవుట్ అయ్యిందన్నమాట.