ఇటీవలే ఆది ‘చుట్టాలబ్బాయ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అటూ ఇటూ అవ్వడంతో ప్రమోషన్లు పెంచి ఏదోలా చుట్టాలబ్బాయ్కి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సాయికుమార్ స్వయంగా రంగంలోకి దిగి తనయుడికి హిట్ ఇవ్వాలని తెగ ప్రయత్నించారు. మొత్తానికి ఫలితం దక్కింది. ఫ్లాప్ అనుకొన్న సినిమాకి కాస్తో కూస్తో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆనందంలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కూడా చేసేశారు. అంతే కాదు… ఆదితో త్వరలోనే ‘పక్కింటి అబ్బాయి’ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించారు కూడా. గరమ్ టైమ్‌లో పక్కింటి అబ్బాయి అనే పేరుని ఆది కోసం రిజిస్టర్ చేయించారట. ఆ పేరుతో ఆదితో ఓ సినిమా చేయాలని అనుకొన్నార్ట. అయితే వీరభద్రమ్ చుట్టాలబ్బాయ్ కథ చెప్పడంతో దానికి ఫిక్సయ్యారు.
చుట్టాలబ్బాయ్ టైటిట్ క్యాచీగా ఉండడం, ఇప్పుడు ఆసినిమా ఆది కెరీర్ కి ప్లస్ అవ్వడంతో… పక్కన పెట్టేసిన పక్కింటి అబ్బాయి టైటిల్ మళ్లీ బయటకు తీశారు. త్వరలోనే ఈ టైటిల్‌తో ఆది సినిమాని మొదలెడతారట. మరి దర్శకుడెరో.. తెలియాలి. నిర్మాతగా మారడానికి సాయికుమార్ ఎలాగూ సిద్దంగానే ఉన్నారు. గరమ్ చిత్రానికి ఆయనే నిర్మాత. ఆ సినిమాతో చేతులు కాలాయి. అయినా సరే, తనయుడిని ప్రమోట్ చేసుకోవాలంటే ఇలాంటి కష్టాలు పడక తప్పదుగా. మొత్తానికి చుట్టాలబ్బాయ్గా వచ్చిన ఆది.. త్వరలో పక్కింటి అబ్బాయిగా మారబోతున్నాడన్నమాట.