తన కెరీర్లో తొలిసారి ఓ ప్రత్యేక గీతంలో నటించింది కాజల్. అదీ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ కోసం. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కాజల్‌కి ఈ ఆఫర్.. ఓదార్పు నిచ్చింది. ఆ టైమ్‌లో పిలిచి అవకాశం ఇస్తానంటే నో ఎలా చెబుతుంది?? అందుకే ప్రత్యేక గీతం అన్నా ఒప్పుకొంది. జనతా లో ఐటెమ్ సాంగ్ చేశాకే… కాజల్ అదృష్టం మారింది. వరుసగా అవకాశాలొస్తున్నాయి. అయితే కాజల్ మాత్రం ఇప్పుడు ఆ పాట ఎందుకు చేశానా అంటూ పశ్చాత్తాప పడుతోందట. ఎందుకంటే కాజల్ ఎదురైతే చాలు మీడియా వాళ్లు ‘ఐటెమ్ పాట ఎందుకు చేశారు?’ అని అడగడం మొదలెట్టారు. ‘ఐటెమ్ పాట’ అనే పదం కాజల్‌ని నచ్చడం లేదట. ”ఐటెమ్ పాట అని ఎందుకంటారు? దాన్ని స్పెషల్ సాంగ్ అని పిలవొచ్చుకదా” అని రుసరుసలాడుతోందని టాక్.
”ప్రత్యేక గీతం అంటే బూతు కాదు. అదో కమర్షియల్ హంగు. నేనేం ఎక్స్పోజింగ్ కోసం ఆ పాట చేయలేదు. కథలో ఆ పాట కూడా కీలకం అన్నారు కాబట్టి చేశాను. ఇప్పుడు నటించాను కదా అని వరుసగా అలాంటి అవకాశాలొస్తే ఒప్పుకోను” అని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది కాజల్. ఈ పాటకోసం కాజల్‌కి అక్షరాలా పాతిక లక్షలు దక్కాయి. మూడు రోజుల్లో పాతిక లక్షలంటే బంపర్ ఆఫరే కదా? అయితే ఈ పాట కోసం ఎంతిచ్చారో కాజల్ చెప్పడం లేదు. ఆ సంగతి అడిగితే.. డబ్బుల మాటర్ ఎందుకు లెండి అంటూ సైడ్ అయిపోతోంది.