గమ్యం… అల్లరి నరేష్ కెరీర్లో మర్చిపోలేని సినిమా. గాలీశీను పాత్రలో నరేష్ అద్భుతంగా నటించాడు. నరేష్ కెరీర్లో ది బెస్ట్ రోల్ అదే. నరేష్‌కి నంది అవార్డు కూడా తీసుకొచ్చింది. ఆ తరహా భావోద్వేగాలు, పాత్రలో అంత డెప్తూ ఉన్న సినిమా నరేష్ చేయలేదు. అయితే.. ఇప్పుడు అలాంటి పాత్ర దొరికిందట. నరేష్ కోసం మలయాళంలో మంచి విజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రాన్ని ఇప్పుడు నరేష్ కోసం రీమేక్ చేస్తున్నారు. వినోదంతో పాటు, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా అది. సరదాగా సాగిపోతున్న కుర్రాడి జీవితం ఒక్క సెల్ఫీతో ఎలా మారిపోయిందన్నదే ఈ సినిమా కథ. మలయాళంలో భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నరేష్‌ని కథానాయకుడిగా ఎంచుకొన్నారు. అలా ఎలాతో ఆకట్టుకొన్న అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తారు.
స్ర్కిప్టు పూర్తి స్థాయిలో సిద్దమైంది. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. నరేష్ కెరీర్లో వైవిద్యమైన కమర్షియల్ చిత్రం. ఎంటర్టైన్మెంట్, హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిదని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం నరేష్ కోసం కథానాయికని అన్వేషిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.