జనతా గ్యారేజ్‌కి ఆఖరి నిమిషాల్లో రీఎడిటింగ్ జరిగింది. సెకండాఫ్‌లో కాస్త లాగ్ అయినట్టు అనిపించినసన్నివేశాల్ని ట్రిమ్ చేశారు. టోటల్‌గా 12 నిమిషాల నిడివిగల సన్నివేశాలకు కత్తెర పడినట్టు టాక్. ముఖ్యంగా మోహన్‌లాల్‌పై తెరకెక్కించిన రెండు సన్నివేశాల్ని రీ ఎడిట్ చేశారని తెలుస్తోంది. తెలుగులో ఈ సన్నివేశాలు లేకపోయినా మలయాళంలో మాత్రం ఉంటాయట. ఫైనల్‌గా జనతా రన్ టైమ్ 2గంటల 28 నిమిషాలుగా తేలింది. ఈరోజు (బుధవారం) అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోల హంగామా మొదలవుతుంది. అర్థరాత్రి 2 గంటలకు తొలి షో పడబోతోంది. టికెట్ ఇప్పటికే రూ.2000ల నుంచి 1000 రూపాయల వరకూ పలుకుతోంది. డిమాండ్‌ని బట్టి రేటు పెరుగుతోంది. ఆఖరి క్షణాల్లో ఈ ధర డబుల్ అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. టోటల్ గా నైజాంలో 13 థియేటర్లలో బెనిఫిట్ షోలు పడే అవకాశం ఉంది. ఒక్కో థియేటర్లో రెండేసి షోల చెప్పున ప్లాన్ చేశార్ట.
అయితే మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం జనతా గ్యారేజ్ వసూళ్లపై పడే అవకాశం ఉంది. పైగా శుక్రవారం భారత్ బంద్ జరగబోతోంది. దాని ఎఫెక్ట్ కూడా కనిపించనుంది. అదృష్టవశాత్తూ తొలి మూడు రోజులకు గానూ మల్టీప్లెక్స్‌లలో టికెట్లన్నీ అయిపోయాయి. సో.. మల్టీప్లెక్స్ వరకూ డబ్బులు వచ్చేసినట్టే. వర్షాలు తగ్గి జనాలు రోడ్డుపైకి రాగలిగితే… ఇక వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం.