జనతా గ్యారేజ్ క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే పనిలో పడింది చిత్రబృందం. రేపు విడుదల కాబోతున్న జనతా గ్యారేజ్‌పై విపరీతమైనమైన అంచనాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా హిట్టవ్వడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. తొలి నాలుగు రోజులు థియేటర్లన్నీ కిటకిటలాడిపోవడం ఖాయం. ఈ ఊపుని ఎలాగైనా వాడుకోవాలని చూస్తోంది జనతా టీమ్. దాంతో పాటు దిల్‌రాజు కూడా వ్యూహాలకు పదును పెట్టారు. జనతా గ్యారేజ్ నైజాం ఏరియాని దిల్‌రాజు సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆయన పలుకుబడిని ఉపయోగించి… జనతా గ్యారేజ్ టికెట్లు రేట్లు పెంచేసుకొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాన్ని పొందారాయన. ఫస్ట్ క్లాస్ టికెట్ ధర.. రూ.100గా నిర్ణయించారు. హైదరబాద్‌లోని సింగిల్ స్క్రీన్‌లో టికెట్టు ధర రూ.60 నుంచి 75 రూ.వరకూ ఉంది. ఈ టికెట్ ఇప్పుడు రూ.100 పెట్టి కొనాలన్నమాట. లోయర్ క్లాస్ టికెట్ ధరల్లో మార్పులేదు. నైజాం అంతా ఇదే ధర వర్తిస్తుంది. ఈ రేటు.. వారం రోజులు పాటు వసూలు చేసుకోవచ్చు. దాంతో.. నైజాం ఏరియాలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మీదట పెద్ద సినిమాలన్నీ ఇదే ధర ఫాలో అయినా అవ్వొచ్చు.