సినిమాల్లో క్రేజ్ తగ్గాక చాలామంది స్టార్లు చూసేది పాలిటిక్స్ వైపే. హీరోలు పాలిటిక్స్‌తో బిజీ అయితే.. హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సంసారాలతో బిజీ అయ్యేవారు. అయితే ఇప్పుడు కథానాయికలూ రూటు మార్చారు. వాళ్లూ పాటిట్రిక్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా నయనతార కూడా రాజకీయాలవైపు దృష్టి సారించిందని తెలుస్తోంది. తెలుగు, తమిళ నాట ఓ వెలుగు వెలుగింది నయన. క్రమంగా ఆమె ప్రభావం తగ్గుతోంది. నవతరం భామలు పోటి ఇస్తుండడంతో హీరోయిన్ల రేసులో వెనుకబడిపోతోంది. తెలుగులో ఆల్మోస్ట్ నయన కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టే.అందుకే తాను ఇప్పుడు పాలిటిక్స్ వైపు చూస్తోందని తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంది నయన.
సాధారణంగా సినిమా వేడుకలకే డుమ్మా కొట్టే నయన ఇంత తీరిక ఎందుకు చేసుకొందో? అని చెన్నై వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. రాజకీయాల్లో చేరితో ఎలా ఉంటుంది? ఏ పార్టీలో ఆదరణ ఎక్కువ లభిస్తుంది? అంటూ నయన తన సన్నిహితుల దగ్గర ఆరా తీస్తోందట. ఇప్పుడు కాకపోయినా 2019 ఎన్నికల ముందు కచ్చితంగా నయన ఏదో ఓ పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశాలున్నాయని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. జయలలిత పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. సాధారణం తనపై ఎన్ని పుకార్లు వచ్చినా పట్టించుకోని నయన… ఈ వార్తలపై స్పందిస్తుందా? లేదా? నిజానికి ఆమె మనసులో ఏముంది? ఇవన్నీ తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.