రకుల్‌ప్రీత్ సింగ్ బీభత్సమైన ఫామ్‌లో ఉంది. వద్దంటే సినిమాలు వచ్చిపడుతున్నాయి. అందులో బడా హీరోలవే ఎక్కువ. తాజాగా మరో సినిమా ఆమె చేతుల్లోకి వెళ్లింది. నాగచైతన్య కథానాయకుడుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా రకుల్ ప్రీత్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయిన తరవాత కల్యాణ్ కృష్ణ చేస్తున్న సినిమా ఇది. స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయ్యింది. అయితే చైతూ ప్రేమమ్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యమైంది. త్వరలోనే ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టేస్తారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్… దృవలోనూ కథానాయికగా నటిస్తోంది. ఇది రకుల్ చేతికొచ్చిన 4వ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.