రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ధృవ. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్కి రీమేక్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. ఇప్పుడు విడుదల తేదీ వాయిదా వేసినట్టు సమాచారం. షూటింగ్ అనుకొన్న తేదీకి పూర్తి కాకపోవడంతో ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకొన్నార్ట. దానికి తోడు దసరా సీజన్ చరణ్‌కి బొత్తిగా కలసి రాలేదు. దసరాకి వచ్చిన గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కాస్త భయపెట్టడంతో రిలీజ్‌ని దీపావళికి వాయిదా వేసినట్టు సమాచారం. వినాయక చవితి సందర్భంగా టీజర్ విడుదల చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అలాంటిదేం లేదని తెలుస్తోంది. విడుదలకు ఇంకా సమయం ఉండడంతో… ఈ ఆలోచన కూడా విరమించుకొన్నార్ట. గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. అక్టోబరు మొదటి వారంలో పాటల్ని విడుదల చేసే అవకాశం ఉంది.