ఓ కథానాయికపై ఊహించని రీతిలో పుకార్లు రావడానికి కారణం… ఆ కథానాయిక ఫామ్ లో ఉండడమేనట. ఈ కామెంట్ చేసిందెవ్వరో కాదు, నిత్యం ఏదో ఓ గాసిప్పుతో కలకలం రేపే సమంత. రేజులో ఉన్నప్పుడే ఎక్కువ మాట్లాడుకొంటుంటారని, ఆ విషయంలో తానెప్పుడూ గర్వపడుతుంటారని చెబుతోంది సమంత! తనపై దూసుకొస్తున్న పుకారు బాణాల గురించి సమంత స్పందించింది. ఇలాంటి గాసిప్పుల గురించి మొదట్లో కంగారు పడిపోయేదట సమంత. అయితే ఆ తర్వాతర్వాత అలవాటైపోయిందట. సెట్లో తనపై వచ్చిన గాసిప్పుల గురించి గుర్తు తెచ్చుకొని మరీ … నవ్వుకొంటుటుందట. ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం లాంటిది అంటోంది. అయితే అప్పుడప్పుడూ కొన్ని గాసిప్పులు బాధ పెట్టాయని, ఇప్పటికీ పెడుతూనే ఉన్నాయని, వాటిపై స్పందించకపోతే.. నిజం అనుకొనే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడూ క్లారిటీ ఇవ్వాల్సివస్తుందని, ఇకపై స్పంచడానికి సిద్దంగా కూడా లేనని అంటోంది.
”నా గురించి మాట్లాడుకోవడం ఓ టైమ్ పాస్ వ్యవహారమే. దాని గురించి నేనూ అతి గా ఆలోచిస్తే.. నాకూ పని లేనట్టే లెక్క. కాబట్టి.. వాటి గురించి ఏమాత్రం పట్టించుకోను. కానీ మరీ మితిమీరితే ఊరుకోను” అంటూ వార్నింగ్ ఇచ్చింది సమంత. మరి చైతూతో పెళ్లి గురించి… మీడియా అంతా కోడై కూస్తుంటే సమంత ఒక్కసారీ ఎందుకు మాట్లాడలేదు. `నేను పెళ్లి చేసుకొనేది చైతూని కాదు` అని ఎందుకు చెప్పడం లేదు. అంటే.. ఇది గాసిప్పనా, నిజమనా? లేదంటే మీడియా సృష్టించిన జోకా?? ఈ విషయంలో అయినా సమంతకు క్లారిటీ ఉందా?