యధా జగన్…తధా రోజా?

యధారాజా తధాప్రజా అనే సూక్తిని వైకాపాకి అన్వయించుకొన్నట్లయితే యధా జగన్ తధా వైకాపా అని చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే దేశంలో అన్ని పార్టీలకి అదే సూత్రం వర్తిస్తుంది. కనుక యధా అధినేత తధా పార్టీ నేతలు అని జనరల్ గా చెప్పుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటే, ఆ పార్టీ నేతలు కూడా ఆయన బాటలోనే నడుస్తూ నోటికి పని చెపుతుంటారు.

ఈ విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాటి మహిళా ఎమ్మెల్యే అనిత పట్ల అనుచితంగా మాట్లాడి ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకి వెళ్ళినా అక్కడా ఆమెకి మొట్టికాయలే పడ్డాయి. అయినా ఆమె తీరు మారలేదు. వైకాపాలో ఉన్నంత కాలం బహుశః ఆమె తీరు మార్చుకోబోరని చెప్పవచ్చు.

ప్రత్యేక హోదా కోరుతూ నిన్న తిరుపతిలో వైకాపా నిర్వహించిన ధర్నాలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ముసుగులో గ్యాంగ్ స్టర్ నయీం కంటే దారుణమైన అరాచకాలు చేయిస్తున్నారని రోజా ఆరోపించారు. ఓటుకి నోటు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాని మోడీ పాదాల వద్ద పెట్టి శరణుకోరి రాష్ట్ర ప్రయోజనాలని ఘోరంగా దెబ్బ తీశారని ఆరోపించారు. తాను నిప్పులాంటి మనిషినినని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఇంతవరకు 18కేసులలో స్టే తెచ్చుకొన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకి అమరావతి బొమ్మలు చూపిస్తూ అమరావతిని భ్రమరావతిగా మార్చేశారని విమర్శించారు. తెదేపా రాజ్యసభ సభ్యులలో ఒకరు బ్యాంక్ దొంగ..మరొకరు సారా కేసులో దొంగ అని విమర్శించారు.

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి వైఖరిని ఆమె మాత్రమే కాదు రాష్ట్రంలో చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ రోజా హద్దులు మీరి విమర్శిస్తున్నారు. అంతే తేడా. రాష్ట్రానికి పెద్దదిక్కు వంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక క్రిమినల్, నరహంతకుడు నయీంతో పోల్చడం, ఆయన కూడా అంతకంటే దారుణాలకి పాల్పడుతున్నారని ఆరోపించడం చాలా దారుణం. ముఖ్యమంత్రి గురించి ఈవిధంగా అనుచితంగా మాట్లాడినందుకు తెదేపా నేతలు కోర్టులో కేసు వేస్తే, రోజా మళ్ళీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాక తప్పదు.

ఓటుకి నోటు కేసులో ముఖ్యమంత్రి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం నేరం అన్నట్లుగా మాట్లాడుతున్న ఆమె, 11 చార్జ్-షీట్స్ లో ఏ-1 ముద్దాయిగా పేర్కొనబడి జైలుకి కూడా వెళ్లి బెయిల్ పై బయటకి వచ్చిన తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకొంటున్నారో అదే నోటితో చెపితే బాగుంటుంది కదా.

రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, సుజనా చౌదరిపై అవినీతి ఆరోపణలు ఉన్నమాట నిజమే. కానీ ఆ విషయం గురించి మాట్లాడటానికి కూడా సరైన బాష, సరైన పదాలు వాడటం మంచిది. లేకుంటే వారు కూడా ఆమెని కోర్టుకీడ్చే అవకాశాలున్నాయి. రాజకీయాలలో ఉన్నవారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాల ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం లేకుంటే వారే చిక్కులో పడతారు. రోజాకి ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి ఆ అనుభవం ఎదురైంది కూడా. కానీ ఆమెలో మార్పు ఏమీ కనబడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close