‘సరైనోడు’తో సూపర్ సక్సెస్ కొట్టాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఐతే బోయపాటి తో సినిమాలు చెయ్యడానికి బడా హీరోలు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ బోయపాటికి కబురు పంపాడు. చిరు 151 వ సినిమా కూడా బోయపాటికే వెళ్లే ఛాన్స్ వుంది. దాసరి – పవన్ కాంబినేషన్ లో రూపు దిద్దుకోవాల్సిన చిత్రానికి దర్శకుడిగా బోయపాటి పేరే పరిశీలిస్తున్నారట. అయితే బోయపాటి చూపు మాత్రం సూర్య పై పడినట్టు టాక్.
బోయపాటి దగ్గర సూర్య మాత్రమే చేయదగ్గ సబ్జెక్ట్ ఒకటి రెడీ గా ఉందని తెలుస్తోంది. ఆ కథ తో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని భావిస్తున్నాడట. పీవీపీ సంస్థ ఆల్రెడీ సూర్య కి అడ్వాన్స్ ఇచ్చిందట. సూర్య కోసం కథలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే సూర్య కోసం బోయపాటి రెడీ చేసుకున్న కథ విన్నట్టు టాక్. సూర్య కూడా నేరుగా తెలుగులో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. తాను కూడా ఈ కథ విని ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్టే. .