గీతా ఆర్ట్స్ లో నాని నటించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ. 30 కోట్లు కొల్లగొట్టి చిత్రసీమ కి షాక్ ఇచ్చింది. మళ్ళీ నాని తో ఓ సినిమా చేయాలని మెగా కాంపౌండ్ ప్లాన్ చేసింది. అందుకు తగిన కసరత్తులు కూడా మొదలైపోయాయి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో ఓ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. అల్లు శిరీష్ తో శ్రీరస్తు – శుభమస్తు తీసి హిట్ ఇచ్చిన పరశురామ్ కి గీతా ఆర్ట్స్ మరో ఆఫర్ ఇచ్చింది. పరశురామ్ ఓ కథ రెడీ చేసి అల్లు అరవింద్ కి వినిపించాడు. ఆ కథ శర్వానంద్ కి బాగా సూట్ అవుతుందనిపించి.. శర్వా కి వినిపించారు. ఐతే తనకున్న కమిట్మెంట్స్ తో ఈ సినిమా ని పక్కన పెట్టాడు శర్వా.
ఈలోగా అరవింద్ కి మరో ఆలోచన వచ్చింది. శర్వా ప్లేస్ లో నాని ఐతే ఈ ప్రాజెక్ట్ కి మరింత కమర్షియాలిటీ యాడ్ అవుతుందని భావించిన అల్లు… నానితో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. నాని కి కూడా చాలా కమిట్మెంట్స్ వున్నాయి. కాకపోతే నాని గురించి ఆగడం లో తప్పులేదన్నది అరవింద్ ఉద్దేశ్యం. ఒకవేళ నానికి కూడా కథ నచ్చితే 2017 లో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుంది.