బెల్లం కొండతో బోయపాటి ప్రయోగం

భ‌ద్ర నుంచి స‌రైనోడు వ‌ర‌కూ బోయ‌పాటి శ్రీ‌ను ప్రయాణం జామ్ జామ్ అంటూ హాయిగా సాగిపోయింది. మ‌ధ్యలో ద‌మ్ము మాత్రం నిరాశ ప‌రిచింది. సింహా, లెజెండ్‌, స‌రైనోడు చిత్రాలు క‌మ‌ర్షియాలిటీకి చిరునామాగా నిలిచాయి. అయితే ఒక‌టే లోపం… బోయ‌పాటి మితిమీరిన యాక్షన్‌, హింస‌ల‌తో నెట్టుకొచ్చేస్తున్నాడ‌ని, యాక్షన్ స‌న్నివేశాల వ‌ల్ల బోయ‌పాటి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు దూరం అయ్యాడ‌న్న టాక్ వినిపిస్తోంది. కేవ‌లం యాక్షన్ సీన్స్‌ని, ఎమోష‌న్‌నీ మాత్రమే న‌మ్ముకొని బోయ‌పాటి నెగ్గుకొస్తున్నాడ‌ని, అన్ని సినిమాలూ ఒకే గాటిన సాగుతున్నాయ‌న్న విమ‌ర్శలొచ్చాయి. వీటిని బోయ‌పాటి కూడా సీరియ‌స్‌గానే ప‌ట్టించుకొన్నాడ‌ని టాక్‌. ఎలాంటి క‌థ‌నైనా తీయ‌గ‌ల‌న‌ని బోయ‌పాటి నిరూపించుకోవ‌డానికి రంగం సిద్దం చేసుకొంటున్నాడు. అందుకు బెల్లం కొండ శ్రీ‌నివాస్ సినిమానే ఓ వేదిక చేసుకొన్నాడ‌ని తెలుస్తోంది.

స‌రైనోడు త‌ర‌వాత బోయ‌పాటి.. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బోయ‌పాటి గ‌త సినిమాల ధోర‌ణిలో ఉండ‌ద‌ట‌. కంప్లీట్‌గా స‌రికొత్తగా ఉండ‌బోతోంద‌ని టాక్‌. తీసింది బోయ‌పాటినేనా? అనే అనుమానం వ‌చ్చేలా ఈ సినిమాని డిజైన్ చేయ‌బోతున్నాడ‌ట‌. క‌థ‌, క‌థ‌ని చెప్పే విధానం వీటిలో బోయ‌పాటి ఓ స‌రికొత్త విధానం పాటించ‌బోతున్నాడ‌ని, బోయ‌పాటి సినిమాల్లోనే ఇది స్పెష‌ల్‌గా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌. ”పెద్ద హీరోల‌తో సినిమాలు చేసేట‌ప్పుడు ఎలాగూ ప్రయోగాల జోలికి వెళ్లలేం. క‌నీసం… యువ హీరోల‌తో సినిమా అనే స‌రికి కాస్త ఒత్తిడి త‌గ్గుతుంది క‌దా, ఇప్పుడు చేయ‌క‌పోతే ఎప్పుడు ప్రయోగం చేస్తాం” అని బోయ‌పాటి చెబుతున్నాడ‌ట‌. కొత్తగా ఆలోచించాలి అనే ఆలోచ‌న మంచిదే. మ‌రి ఈ సినిమాతో బోయ‌పాటిలోని ఎలాంటి యాంగిల్ బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close