అభినందన సభ.. వీర కామెడీ

సినిమా కోసం ఎంత క‌ష్టప‌డినా, ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టినా జ‌యాప‌జ‌యాల‌నేవి ఒక్క రోజులో, ఆమాట‌కొస్తే ఒక్క షోతోనే తెలిసిపోతాయి. సినిమా హిట్టా, ఫట్టా అనేది మార్నింగ్ షో ముగిశాక అర్థమైపోతుంది. యావ‌రేజ్ సినిమాని కాస్త ముక్కీ మూలిగీ హిట్టుకు ద‌గ్గర‌గా తీసుకురావొచ్చుగానీ, డిజాస్టర్లను మాత్రం ఎంత బ‌తిమాలినా లాభం ఉండ‌దు. ప్రమోష‌న్ల‌తో మోత మోగించినా ఉప‌యోగం క‌నిపించ‌దు. సినిమా విడుద‌లై.. ఫ్లాప్ అని తెలిసిపోయిన ప‌ది రోజుల‌కు ‘అభినంద‌న స‌భ’ అంటూ పెడితే దానికంటే మ‌రో జోక్ ఉండ‌దు. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ విష‌యంలో అదే జ‌రుగుతోంది. ఈ సినిమా విడుద‌లైన తొలిరోజే చూసినోళ్లంతా నోరెళ్లబెట్టారు. నాగ్‌ది రాంగ్ ఛాయిస్ అని తేల్చేశారు. రోష‌న్ ప్రతిభ బూడిద‌లో పోసిన ప‌న్నీరైంద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇంత‌టి సినిమాకి ఇక ప్రచారం ఎందుకు అనుకొన్నారో ఏమో.. ప‌క్కన పెట్టేశారు. పాపం.. త‌న‌యుడి సినిమాకి ఎలాంటి హ‌డావుడీ లేక‌పోయే స‌రికి శ్రీ‌కాంత్ మ‌న‌సు చివుక్కుమందేమో? ప‌బ్లిసిటీ బాధ్యత త‌న‌పై వేసుకొన్నాడు. ఈ సినిమాని గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావుకి చూపించి ఆయ‌న ఆశీస్సులు కోరుకొన్నాడు. ఈరోజు మ‌ధ్యాహ్నం నిర్మలా కాన్వెంట్ చూసిన దాస‌రి క‌ర్టెసీకి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి… చిత్రబృందాన్ని అభినందించి.. అది కాస్తా అభినంద‌న స‌భ‌గా మార్చేశారు.

ఎలాగూ ప్రెస్ మీట్ పెట్టాం క‌దా అని సినిమాని పొగ‌డ‌క త‌ప్పలేదు. ప్రతీ సీనూ అద్భుతంగా ఉంద‌ని, నాగార్జున పాత్ర బాగా పండింద‌ని, ఈ సినిమాలోని హీరోని చూస్తుంటే త‌న‌ని తాను చూసుకొన్నట్టు ఉంద‌ని.. ఇంకా చాలా చాలా చెప్పారు. ఈ మాట‌లు ప‌క్కనే ఉన్న శ్రీ‌కాంత్‌కి కంటితుడుపుగా అనిపించినా.. మీడియా వాళ్లకూ, ఈ సినిమా చూసిన జ‌నాల‌కు ఇంత‌కంటే కామెడీ మ‌రోటి క‌నిపించ‌దు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా గురించి మ‌ర్చిపోయారంతా. ఈ ద‌శ‌లో నిర్మలా కాన్వెంట్ విశిష్టత‌లు మ‌ళ్లీ కొత్తగా చెప్పుకు రావ‌డం, ఈ సినిమా ప్రమోష‌న్ల‌కో, కొడుకుని ప్రమోట్ చేసుకోవ‌డానికో శ్రీ‌కాంత్ తాప‌త్రయ‌ప‌డ‌డం కాస్త వింత‌గా అనిపిస్తోంది. శ్రీ‌కాంత్ ఇప్పుడు చేయాల్సింది నిర్మలా కాన్వెంట్ ప‌బ్లిసిటీ బాధ్యత‌లు చూసుకోవ‌డం కాదు. త‌న త‌న‌యుడికి ఎలాంటి క‌థ‌లు సిద్దం చేయాలా, ఏ ద‌ర్శకుడి చేతిలో పెట్టాలా అని ఆలోచించాలి. ఎలాగూ మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ రోష‌న్‌తో సినిమాలు చేయించ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ప్పుడు ఈ ఆర్భాటాల మోజెందుకో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close