అ.ఆ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. అంతకు ముందు ప్రేమమ్‌తో తెలుగులోనూ ఫ్యాన్స్‌ని సంపాదించుకొంది. ఈసినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అదే పేరుతో. మలయాళంలో తాను పోషించిన పాత్రని తెలుగులో మళ్లీ చేస్తోంది. ఎలాగూ తెలుగు సినిమాలు ఒప్పుకొంటున్నా కదా అని ఈమధ్య తెలుగు సినిమాల్ని చూడ్డం మొదలెట్టిందట. అందులో భాగంగా జనతా గ్యారేజ్‌కి వెళ్లిందీ భామ. అయితే చాలా డైలాగులు అర్థం కాలేదని, అందుకే ఎంజాయ్ చేయలేకపోయానని అంటోంది. అనుపమ మలయాళీ. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకొంటోంది. అందుకే తెలుగు అర్థం కాక.. ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయిందట. తెలుగు నేర్చుకొని మళ్లీ సినిమా చూస్తా.. అంటోందీ పిల్ల.
”నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థం అవుతోంది. సెట్లో తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా. డైలాగులు అర్థమయితేనే కదా, మొహంలో భావం పలికేది. అందుకే తెలుగు నేర్చుకోవడానికి కసరత్తులు చేస్తున్నా. అ.ఆలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. ప్రేమమ్‌లోనూ అంతే. త్వరలోనే పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకొంటా” అంటోంది అనుపమ. శర్వానంద్ – దిల్‌రాజుల చిత్రం ‘శతమానం భవతి’లోనూ అనుపమ కథానాయికగా నటిస్తోంది. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలే తణుకులో జరిగింది. అక్కడే ఓ థియేటర్లో జనతా గ్యారేజ్ చూసొచ్చింది అనుపమ. అదీ మేటరు.