దొంగాట తరవాత మంచు లక్ష్మీ నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు యేడాది గ్యాప్ తరవాత మంచు హీరోయిన్ నుంచి వస్తున్న సినిమా.. లక్ష్మీబాంబ్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. లక్ష్మీబాంబ్ అని మాసీ పేరు పెట్టడమే కాదు.. సినిమాకూడా అలానే తీశారు. ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్కా కమర్షియల్ కోణంలో సాగినట్టు తెలుస్తూనే ఉంది. థ్రిల్లింగ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, హారర్, కామెడీ ఇలా అన్నీ మిక్స్ చేసేశారు ఇందులో. అన్నట్టు ‘బాహుబలికి రాజమౌళి కూడా ఇంత స్క్రిప్టు రాసుండడు’ అంటూ ఇండ్రస్ట్రీ ఆల్ టైమ్ హిట్ బాహుబలి గురించి ఈ ట్రైలర్లో ప్రస్తావించడం ఆకట్టుకొంది.
చివర్లో… మోహన్ బాబు లెవిల్లో అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో.. లక్ష్మీ – జస్టిస్ లక్ష్మీ అంటూ ఓ డైలాగ్ పేల్చింది. లక్ష్మీ ప్రసన్న క్యారెక్టర్ లో రకరకాల వేరియేషన్లు కనిపిస్తున్నాయి. పోసాని ఉన్నాడు కాబట్టి కామెడీకి కొదవ ఉండకపోవొచ్చు. ట్రైలర్ చూస్తుంటే ఇది హారరా, థ్రిల్లరా, లేదంటే న్యాయ వ్యవస్థపై వేస్తున్న సెటైరా అనేది క్లారిటీ లేదు. అన్నీ కొంచెం.. కొంచె మిక్స్ చేసేశారేమో? ఈ దీపావళికి ఈసినిమా విడుదల అవుతోంది. రిజల్ట్ ఏమిటో… ఈ బాంబు ఎలా పేలుతుందో తేలేది అప్పుడే. సునీల్ కాశ్యప్ సంగీతం అందించాడు. పాటలు .. ట్రైలర్లో ఇచ్చిన ఆర్.ఆర్.. జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నాయంతే.