నాగచైతన్య – సమంతల ప్రేమాయణం బయటపడిపోయింది. ఇక వాళ్లూ.. పూర్తి స్థాయిలో ప్రేమలో మునిగి తేలడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం మొదలెట్టేశారు. ప్రేమమ్ హిట్టవ్వంగానే రాబోయే ప్రపంచకప్ ముందే భారత జట్టు చేతిలో పెట్టేసినంత మురిసిపోయింది సమంత. ‘ఇంత ఆనందం తట్టుకోలేను బాబోయ్’ అంటూ ఏడ్చేసేంత పని చేసింది. ప్రేమమ్ తరవాత చైతూకి ఖాళీ దొరికినట్టుంది. వీళ్లిద్దరూ కలసి ఇప్పుడు చెరో రాకెట్ పట్టుకొని షటిల్ కోర్టులో దిగిపోయారు. సింగిల్ గేమ్‌లో.. చైతూని సమంత ఓడించి సైనా స్థాయిలో సంబరాలు చేసుకొంది. ఆ ఫొటోని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. సింథుని స్ఫూర్తిగా తీసుకొని ఆడిన మ్యాచ్‌లో నేనే గెలిచా… అనే అర్థం వచ్చేట్టు ట్వీట్ కూడా చేసింది. వాళ్ల లవ్ మేటర్ జగమంతా తెలిసిపోయినప్పుడు ఇక దాపరికాలు ఎందుకు అనుకొన్నారేమో.. మెల్లిమెల్లిగా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఇలా దఫదఫాలుగా బయటపెట్టేస్తున్నారు. మున్ముందు ఇంకే స్థాయిలో రెచ్చిపోతారో..?
గత కొంతకాలంగా సమంత – చైతూ సహజీవనం చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. అయితే ఆ విషయంలో ఇద్దరూ ఎప్పుడూ బయటపడలేదు. అయితే.. మధ్యమధ్యలో కాఫీ షాప్‌కి వెళ్లినట్టు, ఇద్దరూ పక్కపక్కన కూర్చుని సినిమా చూస్తున్నట్టు, బాల్కనీలో బాతాఖానీ పెట్టినట్టు ఫొటోలొచ్చాయి. అవన్నీ సోషల్ మీడియాలో కావల్సినంత సందడి చేశాయి. చైతూ – సమంత వ్యవహారం బయటకు పొక్కింది అలానే మరి. అయితే.. ఇప్పుడు వీళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అందుకే.. తమ ఫొటోల్ని తామే ట్విట్టర్లలో పోస్ట్ చేసుకొంటున్నారు. మున్ముందు ఇలాంటి `చిత్రాలు` ఇంకెన్ని చూడాల్సి వస్తుందో??