తెలుగులో సినిమాలు అందుకే త‌గ్గించింద‌ట‌!

శ్రుతిహాస‌న్ జోరు తెలుగులో బాగా త‌గ్గింది. శ్రీ‌మంతుడు త‌ర‌వాత‌.. ప్రేమ‌మ్‌లోనే క‌నిపించింది. అయితే ఈ రెండు సినిమాలూ హిట్టే. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెండేళ్ల‌లో రెండే సినిమాలు చేయ‌డ‌మేంటి? తెలుగు ప‌రిశ్ర‌మ‌కు శ్రుతి దూరం అవుతోందా? లేదంటే తెలుగు ప‌రిశ్ర‌మే శ్రుతిని దూరం పెడుతోందా? ఇదే విష‌యంపై శ్రుతిహాస‌న్ స్పందించింది. ”నాకు అన్ని భాష‌లూ ముఖ్య‌మే. తెలుగు, త‌మిళం, హిందీల్లో న‌టిస్తున్నా క‌దా?? వివిధ భాష‌ల్లో న‌టిస్తూ, అక్క‌డి సంస్క్రృతి సంప్ర‌దాయాల్ని ద‌గ్గ‌రుండి గ‌మ‌నించ‌డం, వారి అల‌వాట్ల‌ను ప‌రిశీలించ‌డం నాకు ఇష్టం. మా ఇంట్లో కూడా ఐదారు భాష‌లు మాట్లాడుతుంటారు. నాకు తెలీని ఓ కొత్త భాష నుంచి అవ‌కాశం వ‌స్తే.. చేతిలో ఉన్న సినిమాల్ని వ‌దిలేసి మ‌రి న‌టించ‌డానికి సిద్ద‌ప‌డ‌తా” అంటోంది శ్రుతి.

మిగిలిన భాష‌ల నుంచి అవ‌కాశాలు రావ‌డంతోనే తెలుగు సినిమాల్ని త‌గ్గించింద‌ట‌. అయితే తెలుగు ప్రేక్ష‌కులంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌ని, త‌న‌ని న‌టిగా గుర్తించిన తొలి ప్రేక్ష‌కులు తెలుగువాళ్లే అంటోంది. ”నా అభిమాన ప్రేక్ష‌కులు తెలుగువాళ్లే. ఇక్క‌డే నాకు మంచి విజ‌యాలు ద‌క్కాయి. తెలుగు సినిమానీ, ఇక్క‌డి వాతావ‌ర‌ణాన్ని మిస్ అవ్వ‌డం నాకూ వెలితిగానే ఉంది. కాట‌మ‌రాయుడుతో మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాన‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇక నుంచి క‌నీసం యేడాదికి మూడు తెలుగు సినిమాలుండేలా చూసుకొంటా” అని భ‌రోసా ఇచ్చింది శ్రుతిహాస‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close