ఇజం సినిమాపై కల్యాణ్ రామ్ చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. ఈ సినిమా ఫలితమే.. కల్యాణ్ రామ్ భవిష్యత్తేంటన్నది డిసైడ్ చేయనుంది. ఈ సినిమాపై పాతిక కోట్లు పెట్టేశాడు కల్యాణ్ రామ్. పూరి స్టామినా ఉన్నవాడే కాబట్టి.. సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా సొమ్ములు రాబట్టుకోవడం ఖాయమే. నిన్నా మొన్నటి వరకూ ఇజం సినిమాపై అటూ ఇటూ ఊగిసలాడిన కల్యాణ్ రామ్… ఇప్పుడు ఆ సినిమా ఫలితం ఏంటన్న విషయంపై ఓ క్లారిటీకి వచ్చేశాడట. అందుకే ఇజం సంగతి పక్కనెట్టి.. తన తదుపరి సినిమాకి అప్పుడే రూట్లన్నీ క్లియర్ చేసుకొంటూ వస్తున్నట్టు టాక్. ఆమధ్య జరిగిన ఇజం ఇంటర్వ్యూలలో `తదుపరి సినిమా గురించి ఇంకా ఆలోచింలేదు` అంటూ సమాధానం దాటేసిన కల్యాణ్ రామ్… నిజానికి తనకంటూ కొన్ని పక్కా ప్లాన్స్ తో ఉన్నాడని అర్థమవుతోంది.
పటాస్‌తో కల్యాణ్ రామ్‌కి మర్చిపోలేని హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి కల్యాణ్ దగ్గరకు చేరాడని టాక్. సుప్రీమ్ తరవాత రామ్‌తో ఓ సినిమా చేద్దామనుకొన్నాడు అనిల్. అయితే అది వర్కవుట్ కాలేదు. అదే కథని ఎన్టీఆర్‌కీ వినిపించాడు. ఎన్టీఆర్‌కి ఆ కథ నచ్చినా… ఇప్పుడే ప్రయోగాలు చేయకూడదన్న ఉద్దేశంతో పక్కన పెట్టాడు. దాంతో.. కల్యాణ్ రామ్‌తో సెట్ అయిపోదామన్న నిర్ణయానికి వచ్చినట్టు టాక్. పటాస్ సమయంలోనే.. అనిల్ ప్రతిభపై నమ్మకం కలిగి… మరో సినిమాకి ఎగ్రిమెంట్ చేయించుకొన్నాడు కల్యాణ్ రామ్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నవంబరులో పటాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.