లెజెండ్‌తో జగపతిబాబుని విలన్‌గా పరిచయం చేశాడు బోయపాటి శ్రీను. ఆ ప్రయోగం బాగా వర్కవుట్ అయ్యింది. ఆసినిమాకి కొత్త లుక్ రావడంతో పాటు, జగపతిబాబు కెరీర్‌కి లెజెండ్ సినిమా బాగా ప్లస్సయ్యింది. సరైనోడు కీ అదే సేమ్ సీన్ రిపీట్ చేశాడు బోయపాటి. తమిళంలో హీరోగా నటిస్తున్న ఆది పినిశెట్టిని యంగ్ విలన్ గా మార్చాడు. ఎప్పుడైతే ఆదిలాంటి హీరో విలన్ అయ్యాడో.. ఆ క్యారెక్టర్‌కి డెప్త్ పెరిగింది. ఆది వల్ల ఆ సినిమా అవుట్ లుక్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు తన కొత్త సినిమాకీ ఇదే ఫార్ములా పాటించాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. రకుల్‌ప్రీత్ సింగ్‌ని కథానాయికగా ఎంచుకొన్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలోనూ విలన్ పాత్రకి ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు బోయపాటి శ్రీను.
అర్జున్, శరత్ కుమార్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాళ్ల డిఫరెంట్ లుక్కుల్ని సేకరించి.. ఈ సినిమాకి ఎంత వరకూ పనికొస్తారా అని ఆలోచిస్తున్నాడట. శ్రీకాంత్‌ని విలన్ గా మారిస్తే ఎలా ఉంటుందా?? అనే ఆలోచనలోనూ ఉన్నట్టు తెలుస్తోంది. సరైనోడులో శ్రీకాంత్ ఓ కీ రోల్ చేశాడు. తనకీ.. విలన్ పాత్రలు చేయాలని ఉందని ఈమధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో పాటు గడ్డం పెంచి లుక్ మారుస్తున్నాడు. సో… శ్రీకాంత్ అయితే విలన్ పాత్రకు ఎలా ఉంటుందా? అని బోయపాటి శ్రీను ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో వారం పది రోజుల్లో విలన్ పాత్రపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.