భారతావనికి మొత్తంగా షాకిచ్చారు మోడీ జీ. పెద్ద నోట్ల రద్దు తో అన్ని రంగాల్లోనూ కలకలం మొదలైంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సినిమాలపైనా పడే ఛాన్సుందని నిపుణులు చెబుతున్నారు. ఫిల్మ్నగర్లో బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్లే ఎక్కువ. సగం వైటూ… సగం బ్లాకూ ఇలా ఉంటుంది వ్యవహారం. హీరోల పారితోషికాల్లో సగం బ్లాక్ మనీలతోనే నడుస్తుంటాయని భోగట్టా. విడుదలకు ముందు బయ్యర్లు బస్తాల కొద్దీ డబ్బు తీసుకొచ్చి నిర్మాత ముందు గుమ్మరిస్తుంటారు. సో.. సినిమా విడుదలకు ముందు బ్లాక్ మనీ కోట్ల రూపాయల్లో చేతులు మారుతుంటుంది. అందుకే ఐటీ శాఖ సినిమా విడుదలకు ముందే.. నిర్మాతల ఇళ్లలో సోదాలు చేస్తుంటుంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు టాలీవుడ్ లోనూ దుమారం రేపుతోంది. ఈ ఎఫెక్ట్ అర్జెంటుగా సాహసం శ్వాసగా సాగిపో, ఇంట్లో దెయ్యం నాకేం లపై పడడం ఖాయం. 12న విడుదల కావాల్సిన ఇంట్లో దెయ్యం.. వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. సాహసం శ్వాసగా ఎప్పుడొస్తుందన్నది ఈ రోజు సాయింత్రానికల్లా తెలియాల్సివుంది.
ఈ సినిమాల్ని రిలీజ్ చేసినా.. టికెట్లు తెగుతాయన్న గ్యారెంటీ లేదు. దానికి కారణం… టికెట్ కౌంటర్ల దగ్గర రూ.500, 1000 నోట్లు చలామణీ కావు. వంద నోట్లిచ్చి టికెట్లు తీసుకొనే పరిస్థితి కొద్ది రోజుల వరకూ వినియోగదారుడు (ప్రేక్షకుడు)కి లేదు. దాంతో వసూళ్లు దారుణంగా పడిపోతాయి. ఓ వారం రోజులు ఆగితే పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో.. నిర్మాతలూ వేచి చూసే ధోరణిలో ఉండొచ్చు. ఈ రెండు సినిమాలూ ఎప్పుడొస్తాయన్నది ఈరోజు, లేదంటే రేపటిలోగా క్లారిటీ వచ్చేయొచ్చు.