రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో చాలా పెద్ద చేపలు గిల గిల కొట్టేసుకొంటున్నాయి. అన్ని రంగాల్లో మాదిరిగానే.. సినిమా ఫీల్డుపైనా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది. స్టార్లు, డైరెక్టర్లు, హీరోయిన్లు దాదాపుగా బ్లాక్‌లోనే ట్రాన్సేక్షన్స్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు నల్లడబ్బుని ఎలా వదిలించుకోవాలా అనే డైలామాలో పడిపోయారంతా. ఈ లిస్టులో టాలీవుడ్‌కి చెందిన ఓ బడా కమెడియన్ కూడా ఉన్నట్టు భోగట్టా. వందల కొద్దీ సినిమాలు చేసిన ఓ హాస్యనటుడు తన పారితోషికంలో దాదాపు 60 శాతం బ్లాక్ రూపంలోనే తీసుకొంటాడట. అలా.. చాలా పెద్ద ఎత్తున నగదు నిల్వల్ని సమకూర్చుకొన్నట్టు తెలుస్తోంది. భూములు, ఆభరణాలు ఎక్కువగా కనని ఆ కమెడియన్ తన ఆస్థిలో సగ భాగం వరకూక్యాష్ రూపంలోనేఉంచుకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని వైట్ ఎలా చేయాలో తెలీక తల్లడిల్లిపోతున్నట్టు టాక్.
ప్రభుత్వం ఈమధ్య నల్లధనాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైట్ చేసుకోమని ఆఫర్ ఇచ్చింది. ఆసమయంలో ప్రతిఘటించని ఆ కమెడియన్.. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆఫర్లు ఇచ్చే అవకాశమేమైనా ఉందా.. అంటూ తన అడిటర్లను అడుగుతున్నట్టు తెలుస్తోంది. సగానికి సగం ఇస్తామన్నా.. తన బ్లాక్‌ని వైట్ గా మార్చుకోవడానికి ఆ కమెడియన్ సిద్దపడుతున్నాడని తెలుస్తోంది. తన జీవితంలో ఎప్పుడూ ఏ ఒక్కరికీ పైసా వదిలచ్చని ఆ హాస్య నటుడు ఇప్పుడు బ్లాక్‌ని వైట్ చేసుకోవడానికి బినామీల్ని వెదికే పనిలో ఉన్నాడని, వాళ్లు కూడా దొరడకం లేదని… అందుకే రెండ్రోజుల నుంచీ తల్లడిల్లిపోతున్నాడని, ఎవరు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని తెలుస్తోంది. ఇంకా ఇలా.. అల్లాడిపోతున్న స్టార్లు.. ఎంతమంది ఉన్నారో..??