ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యానికి ఎప్పుడో స్పీడు బ్రేకర్లు పడిపోయాయి. ఆస్ట్రేలియాని ఓడించే జట్లు పుట్టుకొస్తున్నాయి. ఈమధ్య చిన్న టీమ్‌లు కూడా ఆస్ట్రేలియాని ఒణికించడం ప్రారంభించేశాయి. శ్రీలంకలో ఘెర పరాభవం తరవాత.. స్వదేశంలో అయినా తేరుకోవాలని ఆసీన్ భావిస్తోంది. అయితే.. ఆస్ట్రేలియా పై ఆశలు చల్లుతోంది సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా – సౌ. ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాకాలో.. ఆసీన్ని సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తుగా ఓడించింది. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాకు పరాభవం తప్పేట్టు లేదు. ఈరోజు మొదలైన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా బౌలర్ల ముందు తల వొంచేశారు ఆస్ట్రేలియన్లు. కేవలం 85 పరుగులకే ఆలౌటై.. తొలి రోజే మ్యాచ్‌ని అప్పగించేశారు. కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేరుకొన్నారు. కెప్టెన్ స్మిత్ (48) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్మిత్‌కి అండగా నిలిచే బ్యాట్స్‌మెన్ కరువయ్యాడు. స్మిత్ లేకపోతే.. ఆసీస్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేదే.
అంతకు ముందు టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. కేవలం 2 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది కంగారూ జట్టు. ఆ తరవాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఫిన్లాండర్ 5 వికెట్లతో ఆసీన్ జట్టు వెన్ను విరిచాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 171 పరుగుల చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగుల ఆధిక్యం సంపాదించింది. చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి కాబట్టి కనీసం 70 నుంచి 100 పరుగులు చేసినా… ఆసీస్ చేతిలోంచి మ్యాచ్ జారిపోయినట్టే.