దర్శకుల్లో కొరటాల శివ రేంజు.. ఆయనకున్న క్రేజ్ మమూలుగా లేవు. కొరటాల కళ చెప్పడమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినంత ఆనందం అనుకొంటున్నారు హీరోలు. ఆయన కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ల దగ్గరకు వెళ్లడు. వెళ్లాడా, కథ చెప్పాడా, అడ్వాన్సు అందుకొన్నాడా.. అంతే. ఇప్పటి వరకూ అదే జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. డిసెంబరులోగానీ, జనవరిలో గానీ ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఆ తరవాత ఎవరితో చేయాలన్న విషయంలో కొరటాల ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చేశాడని చెప్పుకొంటున్నారు. కొరటాల 5వ సినిమా రామ్‌చరణ్‌తో అని ప్రచారం జరుగుతోంది. చరణ్ కూడా కొరటాలతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే కొరటాల దృష్టి మాత్రం పవన్ కల్యాణ్‌పై ఉందని విశ్వసనీయ వర్గాల సమచారం. మహేష్‌తో సినిమా పూర్తి చేసేలోగా పవన్‌కి ఓ కథ చెప్పి, ఓకే చేయించుకోవాలని కొరటాల ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
మీతో సినిమా చేయడానికి నేను సిద్దంగా ఉన్నానన్న సంకేతాల్ని కొరటాల ఆల్రెడీ పవన్ కి పంపేశాడట. పవన్ కి తగిన కథ ఉందంటూ పవన్ సన్నిహితులతో చెప్పాడట కొరటాల. ఇంకేముంది.. ఆ విషయాన్ని పవన్ వరకూ చేరవేసేశారు. ఇక పవన్ నుంచి కొరటాల కు పిలుపు రావడమే ఆలస్యం. ప్రస్తుతం పవన్ మూడ్ పాలిటిక్స్ వైపు మళ్లింది. సభలు, సమావేశాలు అంటూ హడావుడిగా తిరుగుతున్నాడు. మరోవైపు కాటమరాయుడు షూటింగ్ సాగుతోంది. డిసెంబరు నుంచి త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. ఈలోగా.. ఏమాత్రం ఖాళీ దొరికినా కొరటాలను పిలిపించి కథ వినాలని పవన్ భావిస్తున్నాడట. పవన్ కూడా స్పీడు స్పీడుగా సినిమాలు చేయాలని నిర్ణయించుకొన్నాడు. నేసన్ తోనూ పవన్ ఓ సినిమా చేయాలి. కొరటాల కథ వినేసి… దాన్ని ఫైనలైజ్ చేసుకొంటే 2019 ఎలక్షన్ల వరకూ ఇక సినిమాల సంగతి ఆలోచించక్కర్లెద్దు.